Etela Rajender Vs Revanth Reddy: తెలంగాణలో రూ.25 కోట్ల వ్యవహారం కాకరేపుతోంది. మునుగోడు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి సీఎం కేసీఆర్ రూ.25 కోట్లు ఇచ్చారని చేసిన ఆరోపణలు సంచలనంగా మారాయి. తాజాగా ఈటల వ్యాఖ్యలను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సమర్థించారు. ఈటల రాజేందర్ చేసిన వ్యాఖ్యల్లో తప్పేముందని ప్రశ్నించారు. ఈ విషయంలో రేవంత్ రెడ్డి బాధపడి ఏడవటంలో తప్పులేదంటూ సెటైర్లు వేశారు. రేవంత్ రెడ్డి సీఎం కావాలనుకున్నారని.. కానీ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా బీఆర్ఎస్ చేతుల్లోకి వెళ్లిపోయిందన్నారు. తనను పీసీసీ అధ్యక్షుడిగా మారుస్తారనే బాధతోనే రేవంత్ కన్నీళ్లు పెట్టుకున్నారని అన్నారు. మహాత్మ బసవేశ్వర జయంతి సందర్భంగా ట్యాంక్ బండ్ వద్ద ఉన్న బసవేశ్వరుడి విగ్రహానికి ఈటల రాజేందర్‌తో కలిసి నివాళి అర్పించారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అనంతరం మీడియాతో బండి సంజయ్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీకి మునుగోడు ఉప ఎన్నికల్లో కేసీఆర్ రూ.25 కోట్లు ముట్టజెప్పారని ఈటల రాజేందర్ అన్నదాంట్లో తప్పేముంది..? అని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి డబ్బులు తీసుకున్నారని ఈటల అనలేదన్నారు. రాజేందర్, తాను చాలా రోజుల నుంచి మునుగోడు ఎన్నికల్లో కాంగ్రెస్‌కు కేసీఆర్ డబ్బులిచ్చారని చెబుతూనే ఉన్నాం కదా అని అన్నారు. కాంగ్రెస్ నేతలే బహిరంగంగా చర్చించుకుంటున్నారని చెప్పారు. రేవంత్ రెడ్డి బాధపడి ఏడవటంలో తప్పులేదని.. నిజంగా బాధ ఉంటేనే ఏడుపొస్తదన్నారు. 


'కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీకీ బీఆర్ఎస్ డబ్బులు సాయం చేస్తోంది..? నిజమా..? కాదా..? చెప్పాలి. కాంగ్రెస్‌కు ఓటేస్తే బీఆర్ఎస్‌కు ఓటేసినట్లే.. ఇదేమాట గతంలో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, జానారెడ్డి కూడా చెబుతున్నారు కదా... అంతేందుకు కాంగ్రెస్ జాతీయ అధ్యక్షులు మల్లిఖార్జున్ ఖర్గే కూడా బీఆర్ఎస్‌తో పొత్తుకు ప్రయత్నిస్తున్నామని రాజ్ దీప్ సర్దేశాయ్‌తో చెప్పారు కదా.. దీనిపై ఏమంటారు..? కాంగ్రెస్ పార్టీ పూర్తిగా బీఆర్ఎస్ చేతుల్లోకి వెళ్లిపోయింది. ఇది తెలిసి తనను పీసీసీ అధ్యక్షుడిని మారుస్తారనే బాధ రేవంత్‌కు ఉంది. బీఆర్ఎస్‌తో కాంగ్రెస్ పొత్తు తప్పదని తెలిసి ఆ బాధతో వచ్చిన నీళ్లే కన్నీళ్లుగా మారాయి..' అని బండి సంజయ్ అన్నారు.


Also Read: Arjun Tendulkar IPL: అర్జున్ టెండూల్కర్ చెత్త రికార్డు.. ఒకే ఓవర్లో 31 పరుగులు  
 
అతీక్ అహ్మద్ కొడుకును ఎన్‌కౌంటర్ చేస్తే.. వాళ్లకు అనుకూలంగా ఎంఐఎం నేతలు మాట్లాడటం సిగ్గు చేటని అన్నారు. పోలీసులను చంపిన నీచులు, పేదల రక్తం తాగి వేల కోట్లు దోచుకున్న దుర్మార్గుడు అతీక్ అహ్మద్, ఆయన కొడుకు అంటూ ఫైర్ అయ్యారు. అట్లాంటోళ్లకు మద్దతుగా ఎంఐఎం నేతలు, బీఆర్ఎస్ నేతలు మాట్లాడటం సిగ్గుచేటని ఆగ్రహం వ్యక్తం చేశారు. పాతబస్తీని న్యూసిటీ చేయాలని బీజేపీ యత్నిస్తుంటే.. ఉగ్రవాదులను పెంచి పోషిస్తున్న పార్టీ ఎంఐఎం అని ఆరోపించారు. ఓటు బ్యాంకు కోసం మతపరమైన రాజకీయాలు చేస్తున్న బీఆర్ఎస్, ఎంఐఎం పార్టీలు అవసరమా..? తెలంగాణ సమాజం ఆలోచించాలని బండి సంజయ్ కోరారు.


Also Read: Arshdeep Singh Bowling: ఇదేక్కడి బౌలింగ్ సింగ్ మావా.. రెండుసార్లు స్టంప్‌లు విరగొట్టిన అర్ష్‌దీప్.. వాటి ధర ఎంతో తెలుసా..!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe


TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి