హైదరాబాద్: తెలంగాణలోని 17 లోక్ సభ స్థానాల్లో తమ పార్టీ ఒంటరిగానే పోటీ చేయనున్నట్టు బీజేపీ సీనియర్ నేత, కేెంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయ తెలిపారు. ''ప్రధాని నరేంద్ర మోదీ దేశానికి సుపరిపాలన అందించారని, అందుకే ఈసారి తమ పార్టీకి 400పైగా స్థానాలు గెలుచుకునేందుకు కృషిచేస్తోంది'' అని బండారు దత్తాత్రేయ అన్నారు. ఆదివారం హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ దత్తత్రేయ ఈ వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపి కేవలం ఒక్క సీటు మాత్రమే గెలుచుకున్న విషయాన్ని మీడియా ప్రస్తావించగా.. ''అసెంబ్లీ ఎన్నికలను, లోక్ సభ ఎన్నికలతో ముడిపెట్టి చూడలేం'' అని దత్తాత్రేయ బదులిచ్చారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ప్రధాని నరేంద్ర మోదీపై ప్రతిపక్ష నేతలు విమర్శలు చేయడాన్ని దత్తాత్రేయ తీవ్రంగా తప్పుపట్టారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, టీఎంసీ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జి, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు వంటి నేతలంతా ఏదో ఒక అవినీతి కుంభకోణాలకు పాల్పడిన వారేనని, అటువంటి వారా ప్రధాని మోదీని విమర్శించేది అని దత్తాత్రేయ ప్రశ్నించారు. మైనార్టీ ఓటు బ్యాంకు కోసం వారంతా ప్రధాని మోదీని విమర్శిస్తున్నారని అన్నారు. 


ప్రధాని మోదీ తీసుకొచ్చిన వివిధ సంక్షేమ పథకాలతో దాదాపు 40 కోట్ల మంది లబ్ధి పొందారని, అందులో 16 కోట్ల మంది కేవలం ముద్ర యోజన పథకంతోనే లబ్ధి పొందారని దత్తాత్రేయ తెలిపారు.