Munugode Bypoll:  మూడు ప్రచారాలు.. ఆరు గొడవలు.. అన్నట్లుగా తయారైంది మునుగోడు నియోజకవర్గం. ఉప ఎన్నికల ప్రచారంలో  అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ప్రధాన పార్టీల కార్యకర్తలు గొడవలకు దిగుతున్నారు. పరస్పరం దాడులకు సిద్ధమవుతున్నారు. తాజాగా కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతి రెడ్డి కారుపై దాడి జరగడం కలకలం రేపుతోంది. నాంపల్లి మండలంలో స్రవంతి ప్రచారానికి వెళుతుండగా ఈ ఘటన జరిగింది.  ఆమె కాన్వాయ్ వెళుతున్న దారిలోనే బీజేపీ నేతల కార్లు వెళుతున్నాయి. అయితే తమకు సైడ్ ఇవ్వడం లేదంటూ ఇరు వర్గాలు గొడవకు దిగాయి. రెండు పార్టీలకు చెందిన  కార్యకర్తల మధ్య వాగ్వాదం జరిగింది. ఒకరిని ఒకరు తిట్టుకున్నారు కాంగ్రెస్ బిజెపి కార్యకర్తలు. పరిస్థితి చేయిదాటే పోయే పరిస్థితులు ఏర్పడంతో పోలీసులు జోక్యం చేసుకుని ఇరు వర్గాలను చెదరగొట్టారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

నాంపల్లి మండలంలో జరిగిన ఘటనను జిల్లా ఎస్పీ దృష్టికి తీసుకువెళ్లారు కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతి. తనపై బీజేపీ కార్యకర్తలు దాడికి ప్రయత్నించారని ఫిర్యాదు చేశారు. ఘటనకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని పాల్వాయి స్రవంతి డిమాండ్ చేశారు. నాంపల్లిలోని అంబేద్కర్ విగ్రహం దగ్గర  స్రవంతి ధర్నా చేశారు.


మరోవైపు ఈ ఘటనపై బీజేపీ నేతల వాదన మాత్రం మరోలా ఉంది. తమపైనే కాంగ్రెస్ కార్యకర్తలు దాడి చేశారని నల్గొండ జిల్లా బీజేపీ అధ్యక్షురాలు కంకణాల శ్రీధర్ రెడ్డి భార్య నివేదితా రెడ్డి ఆరోపించారు. బీజేపీ నేతలు చెబుతున్న వివరాల ప్రకారం.. చండూరు నుంచి నాంపల్లి వైపు వెళ్తున్న సందర్భంలో  బిజెపి నల్గొండ జిల్లా అధ్యక్షుడు కంకణాల శ్రీధర్ రెడ్డి సతీమణి నివేధిత రెడ్డి వాహనం ముందుగా వెళుతుంది.. వెనుక నుండి పాల్వాయి స్రవంతి వాహనం వస్తుండగా...  సింగిల్ రోడ్డు కావడంతో సైడ్ ఇవ్వలేదని నేపంతోటి కంకణాల నివేదిత రెడ్డి  డ్రైవర్ ను  కాంగ్రెస్ పార్టీకి చెందిన మలిగిరెడ్డి గోవర్ధన్ నిలదీశాడు. తర్వాత గోపి అనుచరులు నివేదితా రెడ్డి డ్రైవర్ పై దాడి చేశారు. మర్రిగూడ మండలం వట్టిపల్లికి చెందిన గోపి తనపై దురుసుగా ప్రవర్తించారంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది నివేదిత రెడ్డి. మహిళా అని కూడా చూడకుండా బూతులు తిట్టి తమ డ్రైవర్ పై చేయి చేసుకున్నారని అందులో ఆరోపించింది.


Read Also: Komatireddy Venkat Reddy: తెలంగాణలో అడుగు పెట్టిన వెంటనే రాహుల్ షాక్.. ఎంపీ కోమటిరెడ్డిపై సస్పెన్షన్ వేటు?


Read Also: Revanth Reddy: రాహుల్ యాత్రలో రేవంత్ రెడ్డి హల్చల్.. మునుగోడు ఉపఎన్ని వేళ టీ కాంగ్రెస్ కు ఫుల్ జోష్



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook