నెమలిపేటలో ప్రేమోన్మాది ఘాతుకం
తెలంగాణలో ఒక ప్రేమోన్మాది యువతిని కత్తితో పొడిచి హత్య చేశాడు. ఆతరువాత తానుకూడా పురుగుల మందు తాగి ఆత్మహత్య పాల్పడిన ఘటన భద్రాద్రి కొత్త గూడెం జిల్లాలో సంచలనం సృష్టించింది.
తెలంగాణలో ఒక ప్రేమోన్మాది యువతిని కత్తితో పొడిచి హత్య చేశాడు. ఆతరువాత తానుకూడా పురుగుల మందు తాగి ఆత్మహత్య పాల్పడిన ఘటన భద్రాద్రి కొత్త గూడెం జిల్లాలో సంచలనం సృష్టించింది.
వివరాల్లోకి వెళితే.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నెమలిపేటలో ప్రభుత్వ పాఠశాలలో విద్యావాలంటీర్ గా పనిచేస్తున్న పల్లవిని అదే గ్రామానికి చెందిన శ్రీనివాసరాజు గతకొంతకాలంగా ప్రేమ పేరుతో ఆమెను వేధిస్తున్నాడు. శనివారం కూడా అలానే ఆమెను వేధించాడు. పాఠశాలలో విధులు ముగించుకొని సాయంత్రం ఇంటికి తిరిగి వస్తుండగా శ్రీనివాసరాజు తనని పెళ్లిచేసుకోవాలని ఒత్తిడి చేశాడు. అందుకు పల్లవి ఒప్పుకోలేదు. ఆగ్రహంతో ఊగిపోయిన శ్రీనివాసరాజు కత్తితో ఆమెను పొడిచి హత్య చేశాడు. అతను కూడా అక్కడికక్కడే పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు సంఘటనా స్థలానికి చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ సంఘటనకు సంబంధించి పూర్తివివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.