Hyderabad: హైదరాబాద్ లో రెచ్చిపోయిన ప్రేమోన్మాది.. వివాహిత పొట్టమీద కూర్చుని కత్తిపీటతో దాడి..
Love Affair: పాతబస్తీ లోని ఛత్రినాకలో దారుణ ఘటన చోటు చేసుకుంది. తనను దూరం పెడుతుందనే కోపంతో.. మహిళ ఇంట్లోకి ప్రవేశించాడు. ఆపై గొడవపెట్టుకుని ఆమెపై కత్తిపీటతో దాడికి పాల్పడ్డాడు.
Boy friend brutally attacked lover in chatrinaka: కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు మహిళల భద్రత కోసం ఎన్ని చట్టాలు తీసుకొచ్చిన కేటుగాళ్లు మాత్రం మారడం లేదు. నిర్భయ, పోక్సో వంటి కఠినచట్టాలు తీసుకొచ్చిన కూడా వీళ్లలో మార్పులు రావడం లేదు. అమ్మాయిలను, మహిళలను ప్రేమ పేరుతో వేధిస్తున్నారు. తమను కాదంటే హత్యలు చేయడానికి సైతం వెనుకాడటం లేదు. ప్రతిరోజు మహిళల వేధింపులకు చెందిన ఘటనలు తరచుగా వార్తలలో ఉంటున్నాయి. తాజాగా, మరో షాకింగ్ ఘటన హైదరాబాద్ లోని ఛత్రినాకలో చోటు చేసుకుంది.
పూర్తివివరాలు..
పాతబస్తీలో ఛత్రినాక కు చెందిన శ్రావ్య (32) కు ఇది వరకే 2019 పెళ్లైంది. కానీ భార్యభర్తల మధ్య తరచుగా గొడవలు రావడంతో.. విడాకులు సైతం తీసుకున్నట్లు సమాచారం. ఈ క్రమంలో.. గౌలిపుర కు చెందిన మణికంఠ, శ్రావ్య లు చిన్ననాటి స్నేహితులు. వీరు ఇద్దరు కూడా సన్నిహితంగా ఉండేవారు. మొదటి భర్తతో విడాకుల అనంతరం శ్రావ్యతో మణికంఠ ప్రేమ వ్యవహారం నడుపుతున్నట్లు తెలుస్తోంది. అయితే... ఆమె కొన్ని రోజులుగా మణికంఠ తో దూరం గా ఉంటుండడంతో, మణి కంఠలో అనుమానం కల్గింది.
ఇదే విషయమై ఇద్దరి మధ్య పలు మార్లు గొడవలు జరిగినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఈరోజు ప్రియురాలిపై కోపంతో.. మంగళ వారం ఉదయం శ్రావ్య ఇంటికి వెళ్లి, ఆమెతో గొడవకు దిగాడు. వారి మధ్య మాటా మాటా పెరగడంతో ఇంట్లోని కత్తి పీఠతో గొంతు కోయడంతో పాటు ముఖం పై దాడి చేశాడు. మహిళ.. అరుపులు విని చుట్టుపక్కల వారు అక్కడికి వచ్చారు. కిటికీ అద్దాలు పగులకొట్టి చూడగా మణికంఠ, ఆమె మీద కూర్చుని కత్తితో దాడిచేస్తున్నట్లు చూశారు.
వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. చుట్టుపక్కల వారు నిందితుడిని చితక బాది పోలీసులకు అప్పగించారు. తీవ్ర గాయాల పాలైన శ్రావ్య ను పోలీసులు, స్థానికుల సహకారంతో చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
ఇదిలా ఉండగా.. బాధితురాలు శ్రావ్య బ్యూటీపార్లర్ వర్క్ చేస్తున్నట్లు తెలుస్తోంది. శ్రావ్య.. తనను దూరంపెడుతుందన్న కోపంతోనే.. మణికంఠకు కత్తిపీటతో దాడికి పాల్పడినట్లు సమాచారం. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని ఛత్రీనాక పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ ఘటన మాత్రం స్థానికంగా తీవ్ర కలకలంగా మారింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter