Ambedkar Open University Admissions: ఏయూలో ప్రవేశ గడువు పొడిగింపు
బీఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం (Ambedkar Open University)లో డిగ్రీ, పీజీ, సర్టిఫికేట్ కోర్సుల్లో ప్రవేశాలకు (AU Admissions Last Date) చివరి తేదీని పొడిగించినట్లు వెల్లడించారు.
బీఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం (Ambedkar Open University)లో ప్రవేశాలకు తుది గడువును పొడిగించింది. బీఏ, బీకాం, బీఎస్సీ డిగ్రీ కోర్సులతో పాటు పీజీ డిప్లొమా, సర్టిఫికెట్ తదితర కోర్సుల్లో చేరడానికి (AU Admissions Last Date) చివరి తేదీని అక్టోబర్ 15 వరకు పొడిగించినట్లు వెల్లడించారు. అసక్తి గల విద్యార్థులు డిగ్రీ, పీజీ సహా ఆయా కోర్సుల్లో చేరడానికి పూర్తి వివరాలను https://braou.ac.in/లో పొందుపర్చినట్టు వర్సిటీ అధికారులు తెలిపారు.
అధికారిక వెబ్‌సైట్‌లో కోర్సుల చేరిక (AU Admissions)కు కావలసిన విద్యార్హతతో పాటు కోర్సుకు సంబంధించిన ఫీజు తదితర వివరాలను పొందు పరిచినట్లు పేర్కొన్నారు. విద్యార్థులకు ఏవైనా సందేహాలుంటే 73829 29570, 73829 29580, 73829 29590, 73829 29600 నెంబర్లలో లేదా అంబేద్కర్ వర్సిటీ సమాచార కేంద్రం 040 2368 0333 / 555 ఫోన్ నంబర్లలో సంప్రదించాలని సూచించారు. IBPS PO Admit Card 2020: ఐబీపీఎస్ పీఓ హాల్ టికెట్స్ డౌన్‌లోడ్ చేసుకోండి
ఫొటో గ్యాలరీలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe