Telangana Govt released Job Notification for Excise and Transport Constable posts: తెలంగాణా రాష్ట్రంలోని నిరుద్యోగులకు కేసీఆర్ సర్కార్ మరో శుభవార్త తెలిపింది. ఇప్పటికే కానిస్టేబుల్, ఎస్ఐ ఉద్యోగాల భ‌ర్తీకి.. గ్రూప్ -1 పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుదల చేసిన తెలంగాణ ప్ర‌భుత్వం తాజాగా ఎక్సైజ్, ర‌వాణా శాఖ‌లో ఉద్యోగాల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుదల చేసింది. ఎక్సైజ్, ర‌వాణా శాఖ‌లో మొత్తంగా 677 ఉద్యోగాల భ‌ర్తీకి తెలంగాణ ప్రభుత్వం నోటిఫికేష‌న్ విడుదల చేసింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఎక్సైజ్, ర‌వాణా శాఖ‌కు సంబందించిన ట్రాన్స్‌పోర్ట్ కానిస్టేబుల్ (హెచ్‌వో) 6 పోస్టులు, ట్రాన్స్‌పోర్టు కానిస్టేబుల్‌ (ఎల్‌సీ) 57 పోస్టులు, ప్రొహిబిష‌న్ అండ్ ఎక్సైజ్ కానిస్టేబుల్ 614 పోస్టులకు గురువారం (ఏప్రిల్ 28) నోటిఫికేష‌న్ వెలువ‌డింది. రాష్ట్రంలోని అర్హులైన అభ్య‌ర్థులు మే 2 నుంచి 20వ తేదీ వ‌ర‌కు ఆన్‌లైన్‌లో ద‌ర‌ఖాస్తు చేసుకోవచ్చు. మిగతా వివ‌రాలు www.tslprb.in వెబ్‌సైట్‌లో ఉన్నాయి.  విషయం తెలుసుకున్న తెలంగాణ యువత ఆనందం వ్యక్తం చేస్తున్నారు. 


ఈ వారం రోజుల్లో తెలంగాణా సర్కార్ వరుసగా జాబ్ నోటిఫికేష‌న్లను విడుదల చేసి నిరుద్యోగులకు తీపి కబురు అందించింది. ముందుగా 16,614 పోలీసు ఉద్యోగాల‌కు నోటిఫికేష‌న్‌ జారీచేసింది. ఇందులో 16,027 కానిస్టేబుల్ ఉద్యోగాలు ఉండగా.. 587 ఎస్ఐ పోస్టులు ఉన్నాయి. అనంతరం 503 గ్రూప్‌-1 పోస్టులకు టీఎస్‌పీఎస్సీ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ ద్వారా 18 శాఖలకు సంబందించిన పోస్టులను భర్తీ చేయనున్నారు. డిప్యూటీ కలెక్టర్‌, డిప్యూటీ సూపరింటెండెంట్‌ ఆఫ్‌ పోలీస్, ట్యాక్స్‌ ఆఫీసర్‌, మున్సిపల్‌ కమిషనర్‌, ఎంపీడీవో లాంటి పోస్టులు ఉన్నాయి. 


ALso Read: Allu Arjun Remuneration: తగ్గేదేలే.. పుష్ప 2 కోసం అల్లు అర్జున్ షాకింగ్ రెమ్యునరేషన్! ఏకంగా డబుల్..


Also Read: Nikhil Siddharth: హీరో నిఖిల్‌ ఇంట పెను విషాదం!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.