BRS Party Cadre Training Program in Nanded: మహారాష్ట్రలోని ప్రతి గ్రామంలో బీఆర్ఎస్ కమిటీలు ఉండాలి.. జెండాలు ఎగరాలని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు, తెలంగాణ సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు. ఎందరో మహానుభావులు పుట్టిన  గడ్డ ఇది అని అన్నారు. మహారాష్ట్రలోని నాందేడ్‌లో బీఆర్ఎస్ పార్టీ శిక్షణ శిబిరాన్ని కేసీఆర్‌ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. అంతకుముందు హైదరాబాద్ ప్రగతిభవన్ నుంచి బేగంపేట విమానాశ్రయానికి చేరుకుని.. అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో నాందేడ్ బయలుదేరి వెళ్లారు. శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించిన అనంతరం.. బీఆర్‌ఎస్‌ జెండాను ఆవిష్కరించారు. మహనీయుల చిత్రపటాలకు నివాళులర్పించారు. మహారాష్ట్రలో బీఆర్ఎస్‌లో పార్టీ ఇతర పార్టీల ముఖ్య నేతలు, ప్రజాప్రతినిధులు చేరారు. 
 
దేశంలో మార్పు కోసమే బీఆర్ఎస్.. ఒక ఉన్నతమైన లక్ష్యంతో పనిచేస్తున్నాని అన్నారు కేసీఆర్. రెండు రాష్ట్రాలు వేల కిలోమీటర్ల మేర సరిహద్దును పంచుకుంటున్నాయన్నారు. కృష్ణా, గోదావరి నదులు పుట్టిన మహారాష్ట్రలో నీటి కొరత ఎందుకని ప్రశ్నించారు. ఒక లక్షా 40 వేల మంది టీఎంసీల వర్షం కురుస్తుందని.. కానీ ఇందులో సగం నీరు ఆవిరైపోతుందని అన్నారు. కేవలం 20 వేల టీఎంసీల నీరు మాత్రమే ఉపయోగించుకుంటున్నామని.. 50 వేల టీఎంసీల నీరు సముద్రం పాలు చేసుకుంటున్నామన్నారు. కరువుతో అల్లాడిన తెలంగాణ నేడు దేశంలో అత్యధిక ధాన్యం పండిస్తోందన్నారు. తెలంగాణలో సాధ్యమైంది మహారాష్ట్రలో ఎందుకు సాధ్యం కాదని ప్రశ్నించారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

"దశాబ్దాల కాలం పాటు పాలించిన కాంగ్రెస్ దేశానికి  ఏమి చేసింది . చిన్న దేశాలైన సింగపూర్, మలేషియా అభివృద్ధి చెందాయి. మహారాష్ట్ర, తెలంగాణ రాష్ట్రాలకు ఎంతో అనుబంధం ఉంది. మహారాష్ట్రలో వారానికోసారి తాగు నీరు వస్తుంది ఎందుకు..? పుష్కలంగా నీరు ఉన్నా వాడుకోలేని పరిస్థితిలో ఉన్నాం. దేశం మొత్తం ఒక మార్పు తేవాలనే లక్ష్యంతో బీఆర్ఎస్ ఆవిర్భవించింది. దేశంలో రైతులు ఎప్పుడూ పోరాటం చేయాల్సిన దుస్థితి ఎందుకు..? మన దగ్గర ఎక్కువ మొత్తంలో నీటి లభ్యత ఉన్నా చాలా చోట్ల కరువును చూస్తున్నాం. తాగడానికి నీటికి కటకట ఎదర్కోంటున్నాం. ఇంత పెద్ద దేశంలో నాలుగైదు భారీ ప్రాజెక్టులు ఎందుకు కట్టకూడదని ప్రశ్నలేవనెత్తారు. ప్రస్తుతం దేశంలోని ప్రజలంతా తెలంగాణ మోడల్‌ కావాలని కోరుకుంటున్నారు.


కాంగ్రెస్ సర్కార్ 50 సంవత్సరాలు పరిపాలిచింది. కానీ అభివృద్ది శూన్యం. బీజేపీ సర్కార్ 16 సంవత్సరాల నుంచి పరిపాలిస్తుంది.  కానీ తాగునీటికి, సాగునీటికి ఎన్నో ఇబ్బందులు ఎదర్కొంటున్నాం. తెలంగాణ ఏర్పడిన తరువాత అనేక పరిష్కరించాం. దేశంలో మార్పు తీసుకురావడానికి మహారాష్ట్ర నాంది కావాలి. ఓట్ల కోసమే పనిచేస్తున్నారు.. కానీ దేశాన్ని అభివృద్దిలోకి తీసుకురావడం లేదు. తెలంగాణ రైతుల బ్యాంకు అకౌంట్లలోకీ నేరుగా వెళుతున్నాయి. ఎటువంటి మధ్యవర్తిత్వం లేదు. రైతులకు బీమా చేశాం. రైతు రాజ్యం తీసుకురావాలి.. రైతు రాజ్యాన్ని ఏర్పాటు చేయాలి. దళితబంధు కింద 10 లక్షల రూపాయలు తిరిగి చెల్లించకుండా దళితులకు ఇస్తున్నాం. 50 వేల కుటుంబాలకు లబ్ది చేకూర్చాం.." అని సీఎం కేసీఆర్ తెలిపారు. 


Also Read: PBKS Vs RR Dream11 Prediction: ఓడిన జట్టు ఇంటికే.. రాజస్థాన్‌తో పంజాబ్ ఫైట్.. డ్రీమ్ 11 టీమ్ ఇలా ఎంచుకోండి  


Also Read: Pawan Kalyan: ఏపీ సీఎం ఏ చర్యలు తీసుకున్నారో ఆ దేవుడికే ఎరుక: పవన్ కళ్యాణ్‌


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe


TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి