Khammam Fire Accident: BRS ఆత్మీయ సమ్మేళనంలో విషాదం.. భారీ అగ్నిప్రమాదం.. ఇద్దరు మృతి, 8 మందికి గాయాలు
Fire Accident in BRS Atmiya Sammelanam Khammam: BRS ఆత్మీయ సమ్మేళనంలో విషాదం చోటు చేసుకుంది. బీఆర్ఎస్ కార్యకర్తలు బాణసంచా పేల్చగా.. నిప్పు రవ్వలు ఎగిరి గుడిసెకు మంటల అంటుకున్నాయి. గుడిసెలోని సిలిండర్ పేలిపోవడంతో భారీ ప్రమాదం సంభవించింది.
Khammam Fire Accident in BRS Atmiya Sammelanam: ఖమ్మం జిల్లా కారేపల్లి బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళ్నలంలో అపశ్రుతి చోటుచేసుకుంది. నాయకులు వస్తున్న సందర్భంగా బాణసంచా కాల్చగా.. ఒక్కసారిగా భారీగా అగ్నిప్రమాదం సంభవించింది. నిప్పు రవ్వలు ఎగిరి పక్కనే ఉన్న గుడిసెలపై పడడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ క్రమంలో గుడిసెల్లో ఉన్న సిలిండర్లు పేలడంతో భారీ శబ్దం వచ్చింది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందగా.. 8 మందికి గాయాలయ్యాయి. పూర్తి వివరాలు ఇలా..
వైరా నియోజకవర్గ బీఆర్‌ఎస్ ఆత్మీయ సమ్మేళనం నిర్వహించేందుకు బుధవారం కారేపల్లి మండలం చీమలపాడులో బీఆర్ఎస్ నేతలు ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమానికి ఎంపీ నామా నాగేశ్వరరావు, వైరా ఎమ్మెల్యే రాములు నాయక్, ఇతర నేతలు హాజరయ్యేందుకు వస్తున్నారు. వారికి ఘన స్వాగతం పలుకుతూ బీఆర్ఎస్ కార్యకర్తలు భారీగా బాణాసంచా పేల్చారు. ఈ క్రమంలో నిప్పు రవ్వలు ఎగిరి.. పక్కనే ఉన్న గుడిసెపై ఎగిరిపడ్డాయి. గుడిసె నుంచి మంటలు రాగా.. అందరూ మంటలు ఆర్పేందుకు ప్రయత్నించారు. అయితే గుడిసెలోని సిలిండర్‌ను ఎవరూ గుర్తించలేదు. ఒక్క సిలిండర్ పేలడంతో భారీ ప్రమాదం సంభవించింది.
ఈ ప్రమాదంలో 10 మందికి తీవ్ర గాయాలు అవ్వగా.. వారిని వెంటనే ఖమ్మం ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారిలో ఒకరు మార్గమధ్యలోనే మరణించారు. మరొకరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. పలువురి పోలీసులు, జర్నలిస్టులకు కూడా గాయాలయ్యాయి. పేలుడు ధాటికి పలువురి కాళ్లు, చేతులు తెగిపడ్డాయి. ఈ ఘటనతో ఎంపీ నామా, ఎమ్మెల్యే రాములు నాయక్ బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనాన్ని రద్దు చేసుకుని అక్కడి నుంచి వెళ్లిపోయారు.
Also Read: COVID-19 Latest Updates: భారీగా కరోనా కేసులు.. 7 నెలల తరువాత రికార్డుస్థాయిలో..
బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో తీవ్ర విషాదం చోటు చేసుకోవడంపై మంత్రి కేటీఆర్ స్పందించారు. మృతుల కుటుంబాలకు అన్ని విధాలుగా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందించాలని ఖమ్మం జిల్లా అధికారులను ఆదేశించారు. అధికారులు, నాయకులతో ఫోన్‌లో మాట్లాడి పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.
ఖమ్మం ఘటనపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన బాధితులందరికీ తక్షణమే మెరుగైన వైద్య సహాయం అందించాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ నేతల ఆనందం కోసం సామాన్య ప్రజల ప్రాణాలతో చెలగాటమాడతారా..? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే బాధ్యులైన బీఆర్ఎస్ నేతలపై హత్యాయత్నం కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. మహబూబ్ నగర్ జిల్లాలో కల్తీ కల్లుతో ఒకరు చనిపోవడంతోపాటు పలువురు ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్లాడుతుండటం సహించరాని నేరమన్నారు. ఇది ముమ్మాటికీ కేసీఆర్ ప్రభుత్వ వైఫల్యమే అని అన్నారు.
Also Read: EBC Nestham Scheme Founds: అకౌంట్‌లోకి డబ్బులు వచ్చేశాయ్.. చెక్ చేసుకోండి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి