EBC Nestham Founds: అకౌంట్‌లోకి వైఎస్సార్‌ ఈబీసీ నేస్తం డబ్బులు వచ్చేశాయ్.. చెక్ చేసుకోండి!

CM Jagan Disburse EBC Nestham Founds: ఈబీసీ నేస్తం లబ్ధిదారుల అకౌంట్‌లోకి డబ్బులు వచ్చేశాయి. బుధవారం రూ.658.60 కోట్ల ఆర్ధిక సాయాన్ని సీఎం జగన్ మోహన్ రెడ్డి బటన్ నొక్కి విడుదల చేశారు. అనంతరం మాట్లాడుతూ.. మహిళను అన్ని విధాలుగా ఆదుకుంటున్నామని చెప్పారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Apr 14, 2023, 01:03 PM IST
EBC Nestham Founds: అకౌంట్‌లోకి వైఎస్సార్‌ ఈబీసీ నేస్తం డబ్బులు వచ్చేశాయ్.. చెక్ చేసుకోండి!

CM Jagan Disburse EBC Nestham Founds: వైఎస్సార్‌ ఈబీసీ నేస్తం లబ్ధిదారుల అకౌంట్‌లో డబ్బులు జమ చేశారు సీఎం జగన్ మోహన్ రెడ్డి. రాష్ట్రవ్యాప్తంగా రెడ్డి, కమ్మ, ఆర్యవైశ్య, బ్రాహ్మణ, క్షత్రియ, వెలమలతో పాటు ఇతర ఓసీ సామాజిక వర్గాలకు చెందిన 4,39,068 మంది లబ్ధిదారులకు బుధవారం రూ.658.60 కోట్ల ఆర్ధిక సాయాన్ని విడుదల చేశారు. ప్రకాశం జిల్లా మార్కాపురంలో జరిగిన బహిరంగ సభలో ఆయన బటన్‌నొక్కి ఒక్కొక్కరి ఖాతాలో రూ.15 వేల నగదు జమ చేశారు. దీంతో ఈ పథకం కింద ఇప్పటివరకు మొత్తం రూ.1,257.04 కోట్లను ప్రభుత్వం అందజేసింది. 
 
ఈ సందర్భంగా సీఎం జగన్ మోహన్ రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో అక్కచెల్లెమ్మలను అన్ని విధాల ఆదుకుంటున్నామన్నారు. వారికి భరోసా ఇచ్చేందుకే ఈ కార్యక్రమం అని చెప్పారు. ఓసీ వర్గాలోని అక్కచెల్లెమ్మలకు మంచి చేయాలన్నదే ప్రభుత్వ లక్షమన్నారు. తమది మహిళ పక్షపాతి ప్రభుత్వం అని.. దేశంలో ఈబీసీ నేస్తం వంటి పథకం ఎక్కడా లేదన్నారు. మేనిఫెస్టోలో లేకపోయినా ఈబీసీ నేస్తం పథకం అమలు చేస్తున్నామన్నారు. గత 46 నెలల్లో 2.07 లక్షల కోట్లు డీబీటీ ద్వారా లబ్ధిదారులకు అందించామన్నారు. మహిళల సాధికారిత కోసం రాష్ట్రంలో అనేక పథకాలు ప్రవేశపెట్టామని.. మహిళలకు 30 లక్షల ఇళ్ల పట్టాలు ఇచ్చామని చెప్పారు. ఒక్కో ఇంటి విలువ సుమారు రూ.10 లక్షలు ఉంటుందన్నారు. 
 
రాష్ట్రంలో ప్రతీ మహిళను సమయానికి ఆదుకుంటున్నామన్నారు సీఎం జగన్. వారికి రక్షణగా దిశ యాప్‌ను అందుబాటులోకి తీసుకువచ్చామని.. ఏ ఆపద వచ్చినా నిమిషాల్లో పోలీసులు వస్తారని చెప్పారు. ఇలాంటి యాప్‌ దేశంలో ఎక్కడైనా ఉందా..? అని అడిగారు. మహిళలకు 50 శాతం రిజర్వేషన్‌పై చట్టం చేశామని.. వారు ఆర్థికంగా, రాజకీయంగా ఎదగాలని ఆకాంక్షించారు. 

 Also Read: Corona Cases: భారీగా కరోనా కేసులు.. 7 నెలల తరువాత రికార్డుస్థాయిలో..

గత ప్రభుత్వ హయాంలో అంతా దోచుకో.. పంచుకో.. తినుకో అన్నట్లు ఉండేదని ముఖ్యమంత్రి విమర్శించారు. చంద్రబాబు హయాంలో ఇన్ని పథకాలున్నాయా..? అని ప్రశ్నించారు. ముసలాయన పాలనలో ఒక్క రూపాయి అయినా మీ ఖాతాల్లో జమ అయిందా..? అని ప్రజలను అడిగారు. ఆ ముసలాయన పాలనలో ఎవరు పంచుకున్నారో.. ఎవరు దోచుకున్నారరో ఆలోచన చేయాలని కోరారు. టిడ్కో ఇళ్లపై సెల్ఫీ ఛాలెంజ్‌ అంటున్నారని.. ఛాలెంజ్‌ అంటే నాలుగు ఫేక్‌ ఫోటోలు కాదు.. ప్రతీ ఇంటికి వెళ్లి ఏం చేశారో చెప్పాలని హితవు పలికారు. 

 Also Read: Fastest 50 in IPL: ఐపీఎల్ చరిత్రలో అత్యంత వేగంగా హాఫ్ సెంచరీ బాదిన టాప్-5 ప్లేయర్లు వీళ్లే..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

TwitterFacebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News