Harish Rao on Rythu Bandhu: తెలంగాణలో ప్రభుత్వం పూర్తిగా కొలువుదీరింది. ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం కూడా నేడు పూర్తయింది. కొత్త ఎన్నికైన ఎమ్మెల్యేల చేత ప్రొటెం స్పీకర్ అజారుద్దీన్ ఒవైసీ ప్రమాణ స్వీకారం చేయించారు. సమావేశం ముగిసిన అనంతరం మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు మీడియాతో మాట్లాడారు. కొత్తగా ప్రమాణ స్వీకారం చేసిన వారందరికీ శుభాకాంక్షలు తెలిపారు. అధికార పక్షమైనా.. ప్రతిపక్షమైనా ఎప్పుటికీ తాము ప్రజల పక్షాన నిలబడతామని చెప్పారు. రైతాంగం అంతా రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం కోసం వేచి చూస్తోందన్నారు. ఎన్నికల ప్రచారంలో వడ్లు అమ్ముకొకండి.. తాము బోనస్‌తో  వడ్లు కొనుగోలు చేస్తామని చెప్పారని.. అధికారంలోకి వచ్చారు  500 రూపాయల బోనస్‌తో వడ్లు ఎప్పుడు కొంటారో చెప్పాలన్నారు. తుపాను కారణంగా కొన్ని చోట్ల వడ్లు తడిశాయని.. వాళ్లను ఆదుకోవాలని కోరారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక రైతుబంధు కింద ఎకరాకి 15 వేల రూపాయలను డిసెంబర్ 9వ ఇస్తామని చెప్పారని.. ఎప్పుడు రైతు బంధు ఇస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు హరీశ్ రావు. ప్రతిపక్షంలో ఉన్నాం కాబట్టి విమర్శ చేయాలని కాదని.. ఈ విషయాలపై కాంగ్రెస్ సర్కారు స్పందిస్తే రైతులకు మేలు జరుగుతుందన్నారు.


అంతకుముందు బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కేశవరావు అధ్యక్షతన సమావేశంలో బీఆర్ఎస్ఎల్పీ నేతగా మాజీ సీఎం కేసీఆర్‌ను ఎన్నుకున్నారుఉ. కేసీఆర్‌ పేరును మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ప్రతిపాదించగా.. మాజీ మంత్రులు శ్రీనివాస్ యాదవ్, కడియం శ్రీహరి బలపరిచారు. శాసనసభాపక్షం మిగతా కమిటీని ఎంపిక చేసే బాధ్యతను కేసీఆర్‌కు సమావేశంలో ఏకగ్రీవంగా తీర్మానం చేశారు.


కాలికి గాయం కావడంతో కేసీఆర్ ప్రస్తుతం యశోద హస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారు. ఆయనతోపాటు కేటీఆర్ కూడా ఆసుపత్రిలోనే ఉన్నారు. దీంతో వీరిద్దరు నేడు ఎమ్మెల్యేలుగా ప్రమాణ స్వీకారం చేయలేదు. ప్రమాణ స్వీకారానికి సంబంధించి మరో రోజు సమయం ఇవ్వాలని శాసనసభ సెక్రటరీని కేటీఆర్ కోరారు. కేసీఆర్ వెంట ఆస్పత్రిలో ఉన్నందున ఈరోజు తెలంగాణ భవన్‌లో జరిగిన బీఆర్ఎస్ఎల్పీ సమావేశానికి కూడా కేటీఆర్ హాజరు కాలేకపోయారు. కేసీఆర్ ఆరోగ్యం కుదుటపడిన తర్వాత ఎమ్మెల్యేగా మరోరోజు ప్రమాణస్వీకారం చేయనున్నట్లు కేటీఆర్ తెలిపారు.


Also Read:  WPL 2024 Auction: మల్లికా సాగర్ ఎవరు..? WPL ఆక్షనీర్ ఎందుకంత స్పెషల్..?


Also Read:  Tata Tiago Price: రూ. 5.60 లక్షలకే 26.49కిమీ మైలేజీ ఇచ్చే టాటా టియాగో..పూర్తి వివరాలు ఇవే!  



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి