BRS MLAs Ready to Join Congress: బీఆర్‌ఎస్‌ అసంతృప్తులపై టీ కాంగ్రెస్ ఫోకస్‌ పెట్టింది. బీఆర్ఎస్‌ ఎమ్మెల్యే టికెట్‌ రానీ నేతలతో టీ కాంగ్రెస్‌ నేతలు టచ్‌లోకి వెళ్లారు. ఇప్పటికే  ఖానాపూర్‌లో టికెట్‌ దక్కని ఎమ్మెల్యే రేఖా నాయక్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరేందుకు సిద్దమయ్యారు. ఆమె భర్త శ్యామ్‌ నాయక్‌ ఇప్పటికే రేవంత్‌ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఆమె కూడా భర్త బాటలోనే పయనించనున్నారు. తన స్థానంలో జాన్సన్ నాయక్‌కు కేసీఆర్ టికెట్ ఇవ్వడంతో పార్టీ మారాలని ఆమె నిర్ణయించుకున్నారు. ఇవాళ కాంగ్రెస్ పార్టీలో రేఖా నాయక్ చేరనున్నారు.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

బీఆర్ఎస్ అధిష్ఠానంపై రేఖానాయక్ ఫైరయ్యారు. అగ్రవర్ణాలకే మంత్రి పదవులు కట్టబెడుతున్నారని ఆరోపించారు. ఉమ్మడి ఆదిలాబాద్‌లో ముగ్గురు ఎస్టీ నేతలను మార్చారని.. తాను మంత్రి పదవి డిమాండ్ చేస్తాననే తనకు టికెట్ ఇవ్వకుండా పక్కన పెట్టారని విమర్శించారు. ఖానాపూర్‌లో తన సత్తా ఏమిటో చూపిస్తానని.. త్వరలోనే నిర్ణయం ప్రకటిస్తానని వెల్లడించారు. బీఆర్ఎస్ టికెట్ ఇచ్చిన జాన్సన్ నాయక్ అసలు ఎస్టీనే కాదని ఆరోపించారు.
 
రేఖా నాయక్‌ తరువాత బోథ్‌ ఎమ్మెల్యే రాథోడ్‌ బాపురావు కూడా కాంగ్రెస్‌లోకి వెళుతున్నట్లు ప్రచారం జరిగింది. అయితే పార్టీ మారుతున్నట్లు జరుగుతున్న ప్రచారంపై ఆయన స్పందించారు. 'కొందరు సోషల్ మీడియాలో నాపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు. నేను పార్టీ మారడం లేదు. తెలంగాణ రావాలనే లక్ష్యంతో అప్పుడు టీఆర్ఎస్‌లో చేరా. ఉద్యోగానికి రాజీనామా చేసి టీఆర్ఎస్‌లో చేరా. తెలంగాణ సాధించాం. భవిష్యత్తులో కూడా బీఆర్ఎస్‌లోనే ఉంటా. కేసీఆర్‌తోనే నడుస్తా. దయచేసి ఇలాంటి ప్రచారాలు చేయవద్దు' అని కోరారు. దీంతో బీఆర్‌ఎస్‌లోనే కొనసాగనున్నారు.


నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం బీఆర్ఎస్‌ను వీడే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. ఆయనకు భరోసా ఇచ్చేందుకు పార్టీ సీనియర్ నేతలు ప్రయత్నాలు చేస్తున్నారని.. కానీ ఆయన కాంగ్రెస్‌లో చేరేందుకు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. వీరేశం తన భవిష్యత్ కార్యాచరణపై రేపు ప్రకటన చేసే అవకాశముంది.


మంత్రి హారీశ్‌ రావుపై సంచలన వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు కూడా పార్టీ మారతారని అంటున్నారు. కేటీఆర్, కవిత సహా నేతలంతా ఆయనపై ఆగ్రహంగా ఉన్నారు. దీంతో అధిష్టానం చర్యలు తీసుకునే అవకాశం కనిపిస్తోంది. సీఎం కేసీఆర్ ప్రకటించిన జాబితాలో మైనంపల్లికి బెర్తు దక్కినా.. ఆయన కుమారుడికి సీటివ్వలేదు. తాజా పరిణామాలతో మైనంపల్లి సీటుపైనా అధిష్ఠానం తీసుకునే నిర్ణయంపై ఉత్కంఠ నెలకొంది.


Also Read: Kothagudem BRS MLA Ticket: కొత్తగూడెంలో సీన్ చేయొద్దని మంత్రి హరీశ్ రావు క్లాస్ ?


Also Read: Vande Bharat Express: వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌లో చేసిన కొత్త మార్పులు ఇవే..!   


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook