MLC Kavitha Comments on Rahul Gandhi: రాహుల్ గాంధీ ఆయన పేరును ఎలక్షన్ గాంధీగా మార్చుకోవాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సూచించారు. ఎన్నికల వచ్చినప్పుడు వచ్చి ఏదో నాలుగు ముచ్చట్లు చెప్పి దానితో నాలుగు ఓట్లు వస్తాయని అనాలోచితమైన చర్య అని విమర్శించారు. తెలంగాణ చాలా జాగరూకతతో వ్యవహరించే సమాజమని, ఈ చైతన్యం కలిగిన ప్రజలు అని చెప్పారు. బోధన్ లో జరిగిన కార్యకర్తల సమావేశం, విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. నిజామాబాద్ జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ ఎంత బలంగా ఉందంటే.. ఎక్కడెక్కడి నాయకులు ఇక్కడికి వస్తున్న దాన్నిబట్టి చూస్తే అర్థమవుతుంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మొన్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వచ్చారని, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ వస్తున్నారని, వచ్చే వారందరికీ స్వాగతం తెలిపారు. "వచ్చే వారందరికీ స్వాగతం చెబుతున్నాం. వచ్చి మీరు ఏం చెప్తారో చెప్పండి. టూరిస్టులు వచ్చి చూడండి.. నిజామాబాద్ మొత్తం తిరగండి. నిజామాబాద్ లో పచ్చబడ్డ పొలాలను చూడండి. మంచిగైన కాలువలను చూడండి. నిండుకుండలా ఉన్న ఎస్సారెస్పీని చూడండి. అన్నీ చూసి వెళ్లిపోండి కానీ ఇక్కడ ఉన్న సుహృద్భావ వాతావరణం చెడగొట్టకండి" అని సూచించారు. 65 ఏళ్ల పాటు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రజలకు కనీస వసతులు కల్పించలేదని విమర్శించారు. ఇలాంటి పరిస్థితుల్లో బీఆర్ఎస్ తో కాంగ్రెస్ పార్టీ ఎలా పోటీ పడుతుందని ప్రశ్నించారు. 


తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ పార్టీతో అవసరం లేదని తేల్చి చెప్పారు. "రాహుల్ గాంధీ వస్తారట. స్వాగతం. వచ్చి అంకాపూర్ చికెన్ రుచి చూడండి. డిచ్పల్లి రామాలయాన్ని సందర్శించండి. బోధన్ వచ్చి ఆదిత్యాన్ని స్వీకరించండి. కానీ ఇక్కడ ఉన్న సుహృద్భావ వాతావరణాన్ని చెడగొట్టకండి" అని సూచించారు. తెలంగాణకు రాష్ట్ర విభజన చట్టంలో ఇచ్చిన హామీల గురించి పార్లమెంటులో ఎందుకు మాట్లాడలేదని రాహుల్ గాంధీని ప్రశ్నించారు. తెలంగాణ ఏర్పాటును విమర్శిస్తూ పార్లమెంటులో ప్రధాని మాట్లాడుతున్న సమయంలో అక్కడే ఉన్న సోనియాగాంధీ రాహుల్ గాంధీ ఎందుకు అభ్యంతరం చెప్పలేదని అడిగారు. గత పది సంవత్సరాలలో తెలంగాణకు బిజెపి ప్రభుత్వం అడుగడుగున అన్యాయం చేస్తున్న ఒక్కరోజు కూడా రాహుల్ గాంధీ ప్రశ్నించలేదని చెప్పారు. రాహుల్ గాంధీ ముత్తాత జవహర్ లాల్ నెహ్రూ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు మొదలుపెట్టిన ఎస్సారెస్పీ ప్రాజెక్టును టిఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మనం పూర్తి చేసుకున్నామని అన్నారు. 


Also Read: పండుగ సీజన్‌ సేల్‌ ప్రారంభం..43, 55, 65 అంగుళాల టీవీలపై 50% వరకు తగ్గింపు!


కాంగ్రెస్ పార్టీ అంటే... ఒక ప్రాజెక్టు మొదలుపెడితే అది పూర్తి కావడానికి రెండు మూడు తరాలు పడుతుందని విమర్శించారు. కానీ కాళేశ్వరం ప్రాజెక్టు మొదలుపెట్టి మూడున్నరెండ్లలో పూర్తిచేసిన ఘనత సీఎం కేసీఆర్ కి దక్కుతుందని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు రైతులు, ప్రాజెక్టుల గురించి తెలంగాణలో మాట్లాడడానికి ఏమీ లేదని తేల్చి చెప్పారు. పెట్టుబడి సాయం దుక్కి దున్నడానికి ముందే అందుతుందని, నిరంతర ఉచిత విద్యుత్తు అందుతుందని, దేశంలో నీటి సుంకం లేని ఏకైక రాష్ట్రం తెలంగాణ అని అన్నారు. 


పంట చేతికొచ్చిన తర్వాత చివరి గింజ వరకు ప్రభుత్వమే కొనుగోలు చేసే ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమేనని స్పష్టం చేశారు. వ్యవసాయం అంటే పండగగా మార్చిన ఘనత సీఎం కేసీఆర్ కు దక్కుతుందని తెలిపారు. చంద్రబాబు హయాంలో నిజాం షుగర్ ఫ్యాక్టరీని ప్రైవేటుపరం చేసినప్పుడు కాంగ్రెస్ నాయకుడు ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. కుటుంబ పెద్దగా రైతులను కడుపులో పెట్టుకొని ఆదుకునేది సీఎం కేసీఆర్ మాత్రమే అని స్పష్టం చేశారు. శాంతిసామరస్యాలతో తెలంగాణలో ప్రశాంతంగా జీవిస్తున్నారని చెప్పారు.


Also Read: Allu Arjun: అసలు పుష్ప సినిమా కథ నేషనల్ అవార్డు టీం వారికి పూర్తిగా అర్థమైందా?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి..