KTR Call To Dharna: లోక్‌సభ ఎన్నికల సమయంలో దేవుళ్ల పేరు మీద ఒట్లు వేసి ఆగస్టు 15వ తేదీకి రుణమాఫీ చేస్తానని చెప్పిన రేవంత్‌ రెడ్డి పూర్తిగా విఫలమవడంతో రాష్ట్రవ్యాప్తంగా రైతులు తీవ్ర ఆందోళన చేస్తున్నారు. ఎక్కడికక్కడ రైతులు రేవంత్‌ ప్రభుత్వంపై ఉద్యమ బాట పట్టారు. వారికి తోడుగా ప్రధాన ప్రతిపక్షం బీఆర్‌ఎస్‌ పార్టీ నిలవనుంది. రుణమాఫీని సక్రమంగా అమలుచేయాలని డిమాండ్‌ చేస్తూ రైతులతో కలిసి ఆందోళనలు చేపడతామని ప్రకటించింది. ఈ మేరకు ఆ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మాజీ మంత్రి కేటీఆర్‌ కీలక ప్రకటన చేశారు.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: Weather Report: తెలంగాణకు హై అలర్ట్‌.. రేపు జిల్లాలకు భారీ వర్ష సూచన


రుణమాఫీ అమలులో విఫలమైన రేవంత్‌ రెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎల్లుండి గురువారం (ఆగస్టు 22) ధర్నాలు నిర్వహిస్తామని కేటీఆర్‌ ప్రకటించారు. 'ఎలాంటి ఆంక్షలు లేకుండా రైతులందరికీ రుణమాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ ఈనెల 22వ తేదీన మండల కేంద్రాలు/ నియోజకవర్గ కేంద్రాల్లో ధర్నాలకు పిలుపునిచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా పెద్ద సంఖ్యలో రైతన్నలు కాంగ్రెస్ పార్టీ రుణమాఫీ ప్రయోజనం పొందకపోవటంతో ఆందోళన చేస్తున్నారని తెలిపారు.


Also Read: Bharat Bandh: ఈనెల 21న భారత్ బంద్.. స్కూల్స్‌, దుకాణాలు అన్నీ మూత?


 


'రూ.2 లక్షల వరకు రుణమాఫీ అందరికీ అయ్యిందని రేవంత్‌ రెడ్డి చెబుతుంటే.. మంత్రులు మాత్రం ఇంకా పూర్తికాలేదని చెబుతున్నారు. ఎవరికీ తోచిన విధంగా వారు మాట్లాడుతూ రైతులను గందరగోళంలో పడుతున్నారు' అని కేటీఆర్‌ వివరించారు. ఎన్నికలకు ముందు రూ.2 లక్షల వరకు రుణమాఫీని అందరికీ ఇస్తామని చెప్పారని గుర్తు చేశారు. ఇప్పుడు రుణమాఫీ లెక్కలు తగ్గిస్తూ రైతులను మోసం చేస్తున్నారని మండిపడ్డారు.


బడ్జెట్‌లో కేటాయించిన రూ.26 వేల కోట్లలో కేవలం 18 వేల కోట్లు ఖర్చు చేసి రైతులను నిలువునా ముంచారని కేటీఆర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. రుణమాఫీ జరగక ఆందోళన చెందుతున్న రైతులకు అండగా ఉంటామని ప్రకటించారు. మంత్రులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు రైతులను గందరగోళానికి గురిచేసిన విధంగా అడ్డగోలుగా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 40 శాతం మంది రైతులకు కూడా రుణమాఫీ లబ్ధి చేకూరలేదని స్పష్టం చేశారు. రైతుకు రూ.2 లక్షల రుణమాఫీ వెంటనే చేయాలని డిమాండ్ చేశారు.


లక్షలాది మంది రైతులకు తాము అండగా ఉంటామని కేటీఆర్‌ తెలిపారు. రుణమాఫీ సక్రమంగా అమలుచేయాలని ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు ఈనెల 22వ తేదీన అన్ని మండల కేంద్రాలతో పాటు నియోజకవర్గ కేంద్రాల్లో ధర్నా నిర్వహిస్తామని ప్రకటించారు. నిరసన కార్యక్రమాల్లో పార్టీ నాయకులు, కార్యకర్తలు, రైతులు పెద్ద ఎత్తున పాల్గొనాలని కోరారు. రైతులకు ఆంక్షలు లేకుండా రుణమాఫీ చేసేవరకు బీఆర్‌ఎస్‌ పార్టీ రేవంత్‌ రెడ్డిపై పోరాటం ఆగదని హెచ్చరించారు.



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


 సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter