Weather Report: తెలంగాణకు హై అలర్ట్‌.. రేపు జిల్లాలకు భారీ వర్ష సూచన

IMD High Alert To Telangana: తెలంగాణకు మరోసారి భారీ వర్ష సూచన ఉంది. రాష్ట్రంలోని సగం జిల్లాలకు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.

Written by - Ravi Kumar Sargam | Last Updated : Aug 19, 2024, 08:21 PM IST
Weather Report: తెలంగాణకు హై అలర్ట్‌.. రేపు జిల్లాలకు భారీ వర్ష సూచన

Telangana Rains: వర్షాకాలంలో భారీ వర్షాలు కురుస్తుండడంతో తెలంగాణ జలంగాణగా మారుతోంది. ఇప్పటికే భారీ వర్షాలు కురవడంతో దాదాపుగా ప్రాజెక్టులన్నీ నిండుకుండల్లా మారిపోయాయి. వర్షాలు క్రమేపీ కురుస్తుండడంతో రాష్ట్రంలో వ్యవసాయ పనులు కూడా జోరుగా సాగుతున్నాయి. ఈ క్రమంలోనే మరిన్ని వర్షాలు పడుతాయని వాతావరణ శాఖ తెలిపింది. రెండు, మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలు భారీ స్థాయిలో పడుతాయని వెల్లడించింది. ఆగస్టు 20 మంగళవారం రోజున భారీ వర్షాలు పడతాయని హైదరాబాద్‌ వాతావరణ శాఖ ప్రకటించింది.

Also Read: Bharat Bandh: ఈనెల 21న భారత్ బంద్.. స్కూల్స్‌, దుకాణాలు అన్నీ మూత?

ఇప్పటికే హైదరాబాద్‌తోపాటు రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కుండపోతగా పడుతున్నాయి. మరోమారు భారీ వర్ష సూచన చేయడంతో జిల్లాలకు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. తాజాగా హైదరాబాద్‌ వాతావరణ శాఖ విడుదల చేసిన వివరాల ప్రకారం.. రాష్ట్రంలోని కొన్ని జిల్లాలకు భారీ వర్షం ముప్పు పొంచి ఉంది. పెద్దపల్లి, జయశంకర్‌ భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం భద్రాద్రి, నాగర్‌కర్నూల్‌, వనపర్తి, నారాయణపేట, గద్వాల్‌ జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయని అధికారులు వెల్లడించారు. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌ జారీ చేశారు. ఇక రాష్ట్రంలోని మిగిలిన చోట్ల కూడా ఉరుములు మెరుపులతో.. ఈదురుగాలులతో కూడిన మోస్తరు వర్షాలు పడతాయని హెచ్చరికలు జారీ చేసింది.

Also Read: Phenyl Pour: విచిత్ర సంఘటన.. రేవంత్ రెడ్డి చిత్రపటానికి ఫినాయిల్‌తో అభిషేకం

 

హైదరాబాద్‌లో కుండపోత
కాగా సోమవారం హైదరాబాద్‌ను భారీ వర్షం ముంచెత్తింది. మధ్యాహ్నం దాదాపు మూడు గంటల పాటు ఏకధాటిగా వర్షం కురిసింది. బంజారాహిల్స్‌, జూబ్లీహిల్స్‌, మాదాపూర్‌, హైటెక్‌ సిటీ తదితర ప్రాంతాల్లో భారీ వర్షం కురవడంతో లోతట్టు ప్రాంతాలు మునిగాయి. అయితే మధ్యాహ్నం పూట కురవడంతో ట్రాఫిక్‌ ఇబ్బందులు తలెత్తలేదు. భారీ వర్షంతో రోడ్లపై వరద ఏరులై పారింది. రోడ్లపై వరద నిలవకుండా సహాయ సిబ్బంది వెంటనే చర్యలు తీసుకున్నారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

 సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News