BRS Party Leaders Complaints: అసెంబ్లీలో.. బహిరంగ సభల్లో.. ఏ కార్యక్రమాల్లోనైనా రేవంత్‌ రెడ్డి రెచ్చిపోతున్నారు. ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి అసభ్య పదాలతో విరుచుకుపడుతున్నారు. తన ప్రభుత్వ వైఫల్యాలను నిలదీస్తున్న గులాబీ పార్టీపై రేవంత్‌ పరుష వ్యాఖ్యలు చేస్తున్నారు. ఎదురుదాడి చేసే క్రమంలో బూతులకు దిగుతున్నారు. దీంతో తెలంగాణ రాజకీయాలు జుగుప్సకరంగా మారాయి.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మేధావులు, సాధారణ ప్రజలు కూడా ఆయన చేసే వ్యాఖ్యలను తప్పుబడుతున్నారు. ఈ క్రమంలో రాజీవ్‌ గాంధీ జయంతి కార్యక్రమంలో ఆయన చేసిన వ్యాఖ్యలు మరింత దుమారం రేపాయి. చిన్నారులు ఉన్న విషయం మరిచి వ్యాఖ్యలు చేయడంతో బీఆర్‌ఎస్‌ పార్టీ ఆగ్రహం వ్యక్తం చేసింది. సభ్యతా సంస్కారం లేని ముఖ్యమంత్రిపై గులాబీ పార్టీ న్యాయ పోరాటానికి దిగింది. ఈక్రమంలో రేవంత్‌ రెడ్డిపై పోలీసులకు ఫిర్యాదు చేయడం కలకలం రేపింది.

Also Read: BRS Party Dharna: రుణమాఫీపై రేవంత్‌ విఫలం.. ఎల్లుండి ధర్నాలతో దద్దరిల్లనున్న తెలంగాణ


హైదరాబాద్‌లోని సోమాజిగూడ సర్కిల్‌లో జరిగిన రాజీవ్‌ జయంతి కార్యక్రమంలో రేవంత్‌ రెడ్డి పరుష వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా బీఆర్‌ఎస్‌ పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని ఖండించారు. ఆ వ్యాఖ్యలు చేసిన రేవంత్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని పంజాగుట్ట పోలీసులకు బీఆర్‌ఎస్‌ పార్టీ నాయకులు ఫిర్యాదు చేశారు.

అనంతరం ఆ పార్టీ సీనియర్‌ నాయకులు దాసోజు శ్రవణ్ కుమార్‌ మాట్లాడారు. మాజీ సీఎం కేసీఆర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేయడంతో పాటు పార్టీ కార్యకర్తలను రెచ్చగొట్టేలా రేవంత్ రెడ్డి మాట్లాడారు. అతడి వాఖ్యలు శాంతి భద్రతలకు విఘాతం కల్పించేలా ఉన్నాయి. ఈ రాష్ట్రంలో రేవంత్ రెడ్డికి ఏమైనా ప్రత్యేక చట్టాలు ఉన్నాయా? వెసులుబాట్లు ఉన్నాయా?' అని ప్రశ్నించారు. సామాన్యుడైనా.. ముఖ్యమంత్రి అయినా అందరిపై చట్టం ఒకేలా పనిచేస్తుందని తెలిపారు.


Also Read: Bharat Bandh: ఈనెల 21న భారత్ బంద్.. స్కూల్స్‌, దుకాణాలు అన్నీ మూత?


విజ్ఞత లేని రేవంత్ రెడ్డి
మాజీ సీఎం కేసీఆర్ బతికుండగానే అతడి విగ్రహం గురించి మాట్లాడటం అంతా చిల్లర వ్యవహారం ఇంకొకటి లేదని ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్, బీఆర్‌ఎస్‌ సీనియర్‌ నాయకులు గెల్లు శ్రీను తెలిపారు. రేవంత్ రెడ్డి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే పోలీసులు ఎందుకు మిన్నకు ఉన్నట్టు ఉండిపోతున్నారని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత విజ్ఞత కోల్పోయి కల్లు తాగిన కోతిలా ప్రవర్తిస్తున్నాడని ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్న వారికి ఉండవలసిన విజ్ఞత అతడికి లేదని అసహనం వ్యక్తం చేశారు. శాంతి భద్రత విఘాతం కలిగించేలా మాట్లాడిన రేవంత్ రెడ్డిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


 సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter