KTR VS Revanth: ఇజ్జత్ ఉంటే..బకెట్ల నీళ్లు పోసుకుని దూకి సచ్చిపో..?..రేవంత్‌ను ఏకీపారేసిన కేటీఆర్.. వీడియో వైరల్..
ktr fires on revanth reddy: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి రేవంత్ రెడ్డిని ఏకీపారేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హమీలపై నిలదీశారు. ఈ వీడియో ప్రస్తుతం వార్తలలో నిలిచింది.
ktr hot comments on cm revanth reddy: తెలంగాణాలో ప్రస్తుతం కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ మధ్యలో.. తగ్గా ఫార్ వార్ నడుస్తుందని చెప్పుకొవచ్చు. ముఖ్యంగా ఇరుపార్టీల నేతలు మాట్లాడుతున్న మాటలు మాత్రం.. చలికాలంలో హీట్ ను పుట్టిస్తున్నాయని చెప్పుకొవచ్చు. రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఒక వైపు గత ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల ముందుంచుతూనే.. మరోవైపు.. పాలనను గాడిన పెట్టే ప్రయత్నాలు చేస్తున్నాట్లు చేస్తుంది. అదే విధంగా గత బీఆర్ఎస్ ప్రభుత్వం తప్పిదాల వల్లనే... ప్రస్తుతం తెలంగాణ అప్పుల పాలు అయ్యిందని కూడా సీఎం రేవంత్ రెడ్డితో పాటు, కాంగ్రెస్ నేతలు విమర్శిస్తున్నారు.
మరోవైపు దీనికి బీఆర్ఎస్ కూడా తగ్గెదేలా.. అన్నవిధంగా కౌంటర్ లు ఇస్తుంది. కాంగ్రెస్ పార్టీ అమలు కానీ 420 హమీలు ఇచ్చి ఎన్నికల్లో గెలిచిందని.. ఎద్దేవా చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ మెడలు వంచి.. ఇచ్చిన ప్రతి ఒక్క హమీను నెరవేర్చేలా చేస్తామని కూడా బీఆర్ఎస్ నేతలు గట్టిగానే ఇచ్చిపాడేస్తున్నారు. ఈ క్రమంలో ప్రస్తుతం తెలంగాణలో బాంబులు పేలుతాయని కాంగ్రెస్ నేతలు అంటున్నారు. బీఆర్ఎస్ నేత కేటీఆర్ అరెస్టు అవుతారని కూడా వార్తలు జోరుగా వస్తున్నాయి.
తెలంగాణలో అసెంబ్లీ సమావేశాలు కూడా వాడి వేడిగా నడుస్తున్నాయి. ఈ క్రమంలో బీఆర్ఎస్ నేతలు మాత్రం... నల్ల చొక్కాలు ధరించి నిరసన వ్యక్తం చేస్తు సమావేశాలకు హజరైనట్లు తెలుస్తొంది. అయితే.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇటీవల ఒక సమావేశంలో మాట్లాడుతూ.. సీఎం రేవంత్ ను ఏకీ పారేసినట్లు తెలుస్తొంది. ప్రజలకు సర్కారు గతంలో అమలు చేసిన పథకాలను కాంగ్రెస్ ఏది కూడా అమలు చేయలేదన్నారు.
రైతు బంధు, రైతు రుణమాఫీ, బతుకమ్మ చీరలు.. ఇలా ప్రతిదాంట్లో ప్రజల్ని మోసం చేశారన్నారు. కాంగ్రెస్ ను ప్రజలు.. పొట్టు పొట్టు తిడుతున్నారన్నారు. హైడ్రా.. అంటూ అమాయకుల ఇళ్లను పడగొట్టారన్నారు. రేవంత్ కు ఇజ్జత్ ఉంటే.. ఇంట్లో బకెట్ల నీళ్లు పోసుకుని దాంట్లో దూకి ఎప్పుడు సచ్చిపోతుండే..అని రేవంత్ ను కేటీఆర్ ఎద్దేవా చేశారు.
Read more: Mohan Babu: మనోజ్ చెప్పేవన్ని అబద్దాలే.. సంచలన లేఖ విడుదల చేసిన మోహన్ బాబు సతీమణి.. ఏముందంటే..?
అదే విధంగా అల్లు అర్జున్ రేవంత్.. పేరు మర్చిపోయాడని.. అరెస్ట్ చేయించి.. చిట్టినాయుడు తన ఈగోను సాటిస్ ఫై చేసుకున్నాడని రేవంత్ పై.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పంచ్ లు కురిపించారు. ఈ వీడియోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారాయి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.