Telangana Assembly Elections 2023: తెలంగాణ ఎన్నికల  తేదీ ప్రకటించినప్పటి నుండి రాష్ట్రంలో రాజకీయం వేడెక్కుతుంది, నిజానికి ఎన్నికల్లో బీఆర్ఎస్ తప్ప మారే ఇతర  పార్టీలు రేసులో లేవు. బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్, పార్టీ నేతలు ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఇక కాంగ్రెస్ బీజేపీ విషయాలకి వస్తే.. కాంగ్రెస్ తన అభ్యర్థులను వాయిదాల వారిగా ప్రకటిస్తుంటే.. బీజీపీ ఇప్పటి వరకు ప్రకటించనేలేదు. ఇక బీఆర్ఎస్ పార్టీ ప్రచార సభలను కూడా ఇప్పటికే ప్రారంభించింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఎన్నికల ప్రచారంలో ముందున్న బీఆర్ఎస్ పార్టీ.. ప్రజల మధ్య దూసుకుపోతుంది. ఈ రోజు  బీఆర్ఎస్ పార్టీ ప్రజాఆశీర్వాద సభ కరీంనగర్ లో జరుగుతుంది. ఎన్నికల ప్రచార సభలో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కేటీఆర్‌ పాల్గొన్నారు. మంత్రి కేటీఆర్‌ మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజలు కొట్లాడి ప్రత్యేక రాష్ట్రం తెచ్చుకున్నాం.. వరుసగా మూడో సారి కూడా బిఆర్ఎస్ పార్టీని గెలిపించి అభివృద్ధి వైపు అడుగులు వేయాలని కోరారు. కరీంనగర్ జిల్లాలో మంత్రి గంగుల కమలాకర్‌ మీద పోటీ చేయటమంటే "పోషమ్మ గుడి ముందు పొట్టేలు కట్టేసినట్టే" అని సినిమా డైలాగులు వాడారు. హిందూ ముస్లింలు కలిసి.. మెలిసి అన్నదమ్ముల్లా ఉంటే.. కొంత మంది దౌర్భాగ్యులు వారి మధ్య గొడవలు పెట్టాలని చూస్తున్నారు. 


ఎమ్మెల్యే, మంత్రి కమలాకర్ నాయకత్వంలో కరీంనగర్ మంచి అభివృద్ధి పథంలో నడుస్తుంది. ముఖ్యంగా బీసీ సంక్షేమం ప్రగతి సాధించిందన్నారు. ఈ నియోకవర్గం నుండి గురుకులాలు, విదేశాలకు వెళ్ళేవాళ్ళకి అండగా ఉండమని హామీ ఇచ్చారు. కరీంనగర్ లో హిందూ- ముస్లిం అల్లర్లు సృష్టించే వారున్నారని.. ఓడిపోయి దొంగ ఏడుపుతో బండి సంజయ్ ఎంపీ అయ్యారు. మోడీని దేవుడు అన్న బండి సంజయ్.. కరీంనగర్ కు ఓ బడి కానీ.. గుడి కానీ తెచ్చాడా..? అసలు బండి సంజయ్ కరీంనగర్ కు ఏం చేసాడని మండిపడ్డారు. 


Also Read: పండుగ సీజన్‌ సేల్‌ ప్రారంభం..43, 55, 65 అంగుళాల టీవీలపై 50% వరకు తగ్గింపు!


ఇప్పటి వరకు బిఆర్ఎస్ పార్టీ పాలన ఎలా ఉందో చూసి ఓటేయాలని సూచించారు.. మరోసారి అవకాశం ఇస్తే ఇంకా అభివృద్ధి పథంలో నడిపించి చూపిస్తామని తెలిపారు. అప్పట్లో మానేరు నీళ్ల కోసం ఎంత కొట్లాడామో మీకే తెలుసు.. కానీ ఇపుడు కాళేశ్వరంతో కరీంనగర్ జిల్లా ప్రాంతం జలాశయంగా మారిందన్నారు. కావున ప్రలోభాలకు లోనయి ఓటు దుర్వినియోగం చేయొద్దని.. ఈ పదేళ్లలో జరిగిన అభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని మరో అవకాశాన్ని ఇవ్వాలని ఓటర్లకు మంత్రి కేటీఆర్‌ విన్నవించారు. 


Also Read: Allu Arjun: అసలు పుష్ప సినిమా కథ నేషనల్ అవార్డు టీం వారికి పూర్తిగా అర్థమైందా?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి..