RS Praveen Kumar Bahujana Rajyadhikara Yatra: బహుజన్ సమాజ్‌ పార్టీ తెలంగాణ విభాగం చీఫ్ కోఆర్డినేటర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నేటి నుంచి బహుజన రాజ్యాధికార యాత్రకు శ్రీకారం చుట్టనున్నారు. 300 రోజుల పాటు సుదీర్ఘంగా సాగే ఈ యాత్ర ఆదివారం (మార్చి 6) సాయంత్రం 4గంటలకు జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం ఖిలాషాపూర్ నుంచి ప్రారంభం కానుంది. యాత్రకు బయలుదేరే ముందు కుటుంబ సభ్యుల నుంచి వీడ్కోలు తీసుకున్నారు. ఈ సందర్భంగా ప్రవీణ్ కుమార్ కుటుంబ సభ్యులు భావోద్వేగానికి లోనయ్యారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ప్రవీణ్ కుమార్ కుమార్తె, కొడుకు ప్రేమతో ఆయన్ను హత్తుకుని కంటతడి పెట్టుకున్నారు. ఇద్దరినీ గుండెలకు హత్తుకుని ప్రవీణ్ వారికి సర్దిచెప్పారు. కుటుంబ సభ్యుల ఆశీర్వాదం తీసుకుని ఇంటి నుంచి బయలుదేరారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.



తెలంగాణలో మెజారిటీ ప్రజలైన బహుజనులను రాజ్యాధికారంలోకి తీసుకురావడమే ధ్యేయంగా ప్రవీణ్ కుమార్ బహుజన రాజ్యాధికార యాత్రకు శ్రీకారం చుట్టారు. ఐపీఎస్ అధికారిగా, గురుకుల పాఠశాలల సెక్రటరీగా ప్రవీణ్ కుమార్ తనదైన ముద్ర వేసిన సంగతి తెలిసిందే. పేద వర్గాలకు చెందిన ఎంతో మంది పిల్లలను ఉన్నత శిఖరాలకు చేర్చడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. ఐపీఎస్ అధికారిగా మరో ఆరేళ్ల సర్వీస్ ఉండగానే అనూహ్యంగా ఆయన రాజీనామా చేశారు. ఆ తర్వాత బహుజన్ సమాజ్ పార్టీలో చేరారు. నల్గొండ వేదికగా జరిగిన బీఎస్పీ సభతో ఆ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. 


ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన సభకు జనం భారీగా తరలి వెళ్లడంతో తెలంగాణ రాజకీయాల్లో ఆయన ప్రభావంపై చర్చకు తెరలేచింది. నిజానికి తెలుగు రాష్ట్రాల్లో బీఎస్పీ ఎప్పుడూ పెద్దగా ప్రభావం చూపించలేదు. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో రెండు సీట్లు గెలుచుకున్నప్పటికీ.. అది ఆ నాయకుల ఛరిష్మా వల్లే తప్ప బీఎస్పీ వల్ల కాదనే అభిప్రాయం ఉంది. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బీఎస్పీలోకి ఎంట్రీ ఇచ్చాక పార్టీని బలోపేతం చేయడంపై ఎక్కువగా ఫోకస్ చేశారు. జిల్లా స్థాయిలో క్యాడర్‌ను పెంచేందుకు, ముఖ్యంగా యువతను పార్టీ వైపు ఆకర్షించేందుకు తనవంతు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలో బహుజన రాజ్యాధికార యాత్రకు శ్రీకారం చుట్టబోతున్న ఆయన తెలంగాణ రాజకీయాల్లో ఎంత మేర ప్రభావం చూపుతారో వేచి చూడాలి. 


Also Read: IND vs SL: జడేజా సూపర్ షో.. తొలి టెస్టులో భారత్ ఘన విజయం! విరాట్ కోహ్లీకి స్పెషల్ గిఫ్ట్!!


Also read: Tirumala: తిరుమలలో ఘనంగా అనంతళ్వారు 968వ అవతారోత్సవం


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook