Telangana Cabinet Expansion: గతేడాది చివర్లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పదేళ్ల విరామం తర్వాత అధికారంలోకి వచ్చింది. అంతేకాదు కకావికలమైన పార్టీని ఏకతాటిపై తీసుకొచ్చి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారు పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి. ఎన్నికల్లో గెలుపు తర్వాత సీనియారిటీని పక్కన పెట్టి.. బయట నుంచి వచ్చిన రేవంత్ రెడ్డికే తెలంగాణ ముఖ్యమంత్రి పగ్గాలు అప్పగించింది కాంగ్రెస్ అధిష్ఠానం. అయితే అసెంబ్లీ ఎన్నికలు అయిన వెంటనే లోక్ సభ ఎన్నికలు వచ్చి పడ్డాయి. దీంతో పాలన కంటే లోక్  సభలో  ఎంపీ సీట్లు గెలవడంపైనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టి సారించారు.  ఈ ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ 8 లోక్ సభ సీట్లను గెలుచుకుంది. అటు భారతీయ జనతా పార్టీ కూడా 8 సీట్లు గెలుచుకొని సమఉజ్జీగా నిలిచింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అంతేకాదు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి బీజేపీ పక్కలో బల్లంలా మారింది. ప్రస్తుతం తెలంగాణలో ముఖ్యమంత్రి కాకుండా మరో 11 మంది మంత్రివర్గంలో ఉన్నారు. ఈ సారి మంత్రి వర్గ విస్తరణలో బీఆర్ఎస్ నుంచి ఇప్పటికే కొందరు ఎమ్మెల్యేగా కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు. ఇందులో మొత్తంగా మరో ఆరుగురికి కొత్తగా మంత్రివర్గంలో ఛాన్స్ దక్కే అవకాశాలున్నాయి. పార్లమెంట్ ఎన్నికల ప్రచారం సందర్భంగా ముదిరాజ్ లకు ప్రాతినిధ్యం మక్తల్ శాసనసభ్యుడైన వాకిటి శ్రీహరిని మంత్రి వర్గంలో తీసుకొనే ఛాన్సెస్ ఉన్నాయి. అటు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా ఈ సారి మంత్రివర్గంలో తీసుకునే అవకాశం ఉంది. అటు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ ను కూడా మంత్రి వర్గంలో తీసుకునే అవకాశాలున్నాయి. వీళ్లిద్దరు ఆయా పార్లెమంటులో తమ అభ్యర్ధులను గెలుపించుకొని  అధిష్ఠానం దగ్గర మంచి మార్కులే కొట్టేసారు. ఈ సారి పెద్దపల్లి నుంచి వివేక్ కుమారుడు గడ్డం వంశీ ఎంపీగా గెలిపించుకున్నారు. అటు భువనగిరి ఎంపీ సీటు గెలవడంలో కోమటిరెడ్డి కీ రోల్ పోషించారు. మొత్తంగా 18 మందికి ముఖ్యమంత్రితో కలిసి మంత్రి వర్గంలో ఛాన్స్ ఉంది. ఇప్పటికే రేవంత్ తో కలిపితే 12 మంది ఉన్నారు. ఈ సారి విస్తరణలో 4 నలుగురికి ఛాన్స్ ఇచ్చే అవకాశాలున్నాయి. మరో 2 తర్వాత భర్తీ చేయనున్నట్టు సమాచారం.


మరోవైపు తెలంగాణ మంత్రి వర్గంలో ముస్లిమ్ మైనారిటీ వర్గం నుంచి ఎవరు మంత్రులుగా లేరు. ఈ సారి మంత్రివర్గంలో మైనారిటీ వర్గం నుంచి ఒకరికి మంత్రివర్గంలో ఛాన్స్ దక్కే అవకాశం ఉంది. సామాజిక వర్గాలగా చూసుకుంటే.. తెలంగాణ మంత్రివర్గంలో రెడ్డి సామాజిక వర్గానికే ఎక్కువ ప్రాధాన్యత దక్కిందని చెప్పాలి. ఈ సారి మంత్రివర్గంలో మైనారిటీ, ఎస్సీ ల నుంచి మాల, మరో రెడ్డితో పాటు ఒక బీసీకి ఛాన్స్ దక్కే అవకాశం ఉంది.


Also Read: Saurabh Netravalkar: మనోడే అనుకుంటే ముంచేసేలా ఉన్నావే.. ఇండియాకు వచ్చేయ్ బ్రో.. ఆ బౌలర్‌కు పిలుపు..!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.