Delhi Liquor Scam:  దేశ వ్యాప్తంగా ప్రకంపనలు రేపుతున్న ఢిల్లీ లిక్కర్ స్కాంలో మూడో అరెస్ట్ చేసింది సీబీఐ. ఈ కేసుకు సంబంధించి గతంలో విజయ్ నాయర్, సుమేంద్రు మహేతును అరెస్ట్ చేశారు. తాజాగా హైదరాబాద్ కు చెందిన బోయినపల్లి అభిషేక్ ను అదుపులోకి తీసుకుంది. హైదరాబాద్ నుంచి అభిషేక్ ను ఢిల్లీకి తరలించిన సీబీఐ అధికారులు..  రౌస్ అవెన్యూ కోర్టు ముందు హాజరుపరిచారు. అభిషేక్ కు  5 రోజుల  కస్టడీ కోరింది సీబీఐ. అయితే మూడు రోజుల కస్టడీకి సిబిఐ కోర్టు అనుమతి ఇచ్చింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇండోస్పిరిట్ అకౌంట్ నుండి 3.85 కోట్ల రూపాయలు అభిషేక్ బోయిన్‌పల్లి ఖాతాలో  చేరాయని సిబిఐ ఆరోపించింది. ఈ నగదు బదిలీపై అభిషేక్ ఎలాంటి పత్రాలు చూపించలేదని కోర్టుకు తెలిపింది. రెండు, మూడు ఖాతాల ద్వారా
అభిషేక్ ఖాతాలోకి నిధులు వచ్చాయని సీబీఐ వాదించింది. ఈ నగదును అభిషేక్ వివిధ కంపెనీల్లో పెట్టుబడిగా పెట్టారని..  ఆ కంపెనీల్లో అభిషేక్ కు షేర్లు ఉన్నాయని సీబీఐ కోర్టుకు తెలిపింది. ఢిల్లీ లిక్కర్ పాలసీ విధానం సమయంలో అభిషేక్ వేర్వేరు ప్రదేశాల్లో జరిగిన సమావేశాలకు హాజరయ్యాడని వెల్లడించింది. సీబీఐ కోర్టు ఆదేశాలతో మూడు రోజుల పాటు బోయినపల్లి అభిషేక్ ను విచారించనున్నారు సీబీఐ అధికారులు. ఈ విచారణలో కీలక విషయాలు వెలుగులోనికి వచ్చే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.


ఢిల్లీలో వెలుగుచూసిన లిక్కర్ స్కాంలో తెలంగాణ లింకులు బయటపడ్డాయి. తెలంగాణ మద్యం వ్యాపారుల కేంద్రంగానే కుంభకోణం జరిగిందని ఢిల్లీ బీజేపీ నేతలు ఆరోపించారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూతురు, ఎమ్మెల్సీ కవిత ఈ స్కాంలో కీలకంగా ఉన్నారని బీజేపీ ఎంపీ ఆరోపించడం కలకలం రేపింది. అయితే లిక్కర్ స్కాంలో తనపై వచ్చిన ఆరోపణలను ఎమ్మెల్సీ కవిత ఖండించారు. అయినా కవిత చుట్టూనే సీబీఐ, ఈడీ విచారణ కొనసాగుతోంది. లిక్కర్ స్కాంకు సంబంధించి హైదరాబాద్ లో సీబీఐ, ఈడీ సోదాలు జరిపిన కార్యాలయాలన్ని కవిత సన్నిహితులవే కావడంతో ఈ కేసులో సంచలనం జరగబోతుందనే ప్రచారం సాగింది. దసరా పండుగ తర్వాత కీలక పరిణామాలు జరుగుతాయని కొందరు బీజేపీ నేతలు కామెంట్ చేశారు. వాళ్లు చెప్పినట్లే తాజా పరిణామాలు జరుగుతున్నాయి.


లిక్కర్ స్కాంలో తాజాగా సీబీఐ అరెస్ట్ చేసిన అభిషేక్ .. గతంలో కవిత దగ్గర పని చేశారని తెలుస్తోంది. రాబిస్ డిస్టిలరీస్ తో పాటు మరో 9 కంపెనీల్లో ఆయన డైరెక్టర్‌గా ఉన్నట్లు సీబీఐ గుర్తించింది.కేంద్ర కార్పోరేట్ వ్యవహారాల శాఖ సమాచారం ప్రకారం తొమ్మిది కంపెనీల్లో అభిషేక్ రావు వాటాలు కలిగి వున్నాడు. ఆ 9 కంపెనీల్లో వివిధ రకాల వ్యాపారాలు వున్నాయి. రియల్ ఎస్టేట్, మైనింగ్ క్వారీయింగ్, మాన్యుఫ్యాక్చరింగ్, కెమికల్స్ మరియు కెమికల్ ప్రొడక్స్ట్, కంప్యూటర్ రిలేటెడ్ సర్వీసులు వున్నాయి. అభిషేక్ రావు అరెస్టుతో ఢిల్లీ మద్యం కుంభకోణంలో డొంకంతా కదులుతుందని భావిస్తున్నారు. ఈ కేసులో నెక్స్ట్ అరెస్ట్ ముఖ్యమంత్రి కేసీఆర్ ఫ్యామిలీ నుంచే జరగవచ్చనే ప్రచారం జోరుగా సాగుతోంది. మునుగోడు ఉపఎన్నికకు ముందే ఈ సంచలనం జరగవచ్చని కూడా అంటున్నారు.


Read also: Munugode Bypoll: కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి జంప్.. మునుగోడులో రేవంత్ రెడ్డికి సవాల్


Read also: Mulayam Singh Yadav Dead: ములాయం సింగ్‌ యాదవ్‌ ఫ్యామిలీ, ఎడ్యుకేషన్ వివరాలు ఇవే!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook