Munugode Bypoll: కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి జంప్.. మునుగోడులో రేవంత్ రెడ్డికి సవాల్

Munugode Bypoll:మునుగోడు ఉప ఎన్నికలు సమీపిస్తోన్న వేళ ఈనెల 15న ఫ్యామిలీతో కలిసి ఎంపీ కోమటిరెడ్డి విదేశీ పర్యటనకు వెళుతున్నారు. ఉప ఎన్నిక ఫలితాల తర్వాతే ఆయన తిరిగి హైదరాబాద్ రానున్నారు.మునుగోడు ఉప ఎన్నిక ప్రచారానికి దూరంగా ఉండాలనే ఉద్దేశ్యంతోనే వెంకట్ రెడ్డి విదేశీ పర్యటనకు వెళ్తున్నారని చెబుతున్నారు 

Written by - Srisailam | Last Updated : Oct 10, 2022, 12:58 PM IST
  • మునుగోడులో కోమటిరెడ్డి కలకలం
  • ఈనెల 15న విదేశాలకు వెంకట్ రెడ్డి
  • వెంకట్ రెడ్డిపై కాంగ్రెస్ కేడర్ గుస్సా
Munugode Bypoll: కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి జంప్.. మునుగోడులో రేవంత్ రెడ్డికి సవాల్

Munugode Bypoll:  మునుగోడు ఉప ఎన్నిక ప్రచారం తారా స్థాయికి చేరింది. అదే సమయంలో నియోజకవర్గంలో రాజకీయ సమీకరణలు రోజురోజుకు మారిపోతున్నాయి. ప్రధాన పార్టీల పోటాపోటీ వ్యూహాలతో గంటకో ట్విస్ట్ వెలుగుచూస్తోంది. మునుగోడును కాంగ్రెస్ కంచుకోటగా చెబుతుంటారు. 2018 ఎన్నికల్లో రాష్ట్రమంతా కేసీఆర్ హవా వీచినా మునుగోడులో కాంగ్రెస్ అభ్యర్థి 28 వేలకు పైగా ఓట్లతో ఘన విజయం సాధించారు. ఉప ఎన్నికలోనూ తమ సిట్టింగ్ సీటును కాపాడుకునేందుకు పీసీసీ వ్యూహాలు రచిస్తోంది. అయితే ప్రతిష్టాత్మకంగా మారిన బైపోల్ లో కాంగ్రెస్ కు షాకిచ్చారు ఆ పార్టీ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. ప్రచారానికి వస్తారని పార్టీ కేడర్ ఆశిస్తుండగా.. ఆయన మాత్రం ఝలక్ ఇచ్చేశారు.

మునుగోడు ఉప ఎన్నికలు సమీపిస్తోన్న వేళ ఈనెల 15న ఫ్యామిలీతో కలిసి ఎంపీ కోమటిరెడ్డి విదేశీ పర్యటనకు వెళుతున్నారు. ఉప ఎన్నిక ఫలితాల తర్వాతే ఆయన తిరిగి హైదరాబాద్ రానున్నారు.మునుగోడు ఉప ఎన్నిక ప్రచారానికి దూరంగా ఉండాలనే ఉద్దేశ్యంతోనే వెంకట్ రెడ్డి విదేశీ పర్యటనకు వెళ్తున్నారని చెబుతున్నారు. మునుగోడు నుంచి బీజేపీ అభ్యర్థిగా రాజగోపాల్ రెడ్డి పోటీ చేస్తున్నారు. తన సోదరుడికి వ్యతిరేకంగా కాంగ్రెస్ గెలుపు కోసం పని చేయడం ఇష్టం లేకే  కోమటిరెడ్డి జంప్ అయ్యారని అంటున్నారు. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డితో పాటు  కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతి మునుగోడు ప్రచారానికి  కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వస్తారని కొన్ని రోజులుగా చెబుతున్నారు. ఇప్పుడు వెంకట్ రెడ్డి విదేశాలకు వెళుతుండటంతో కాంగ్రెస్ కేడర్ లో నిరాశ అలుముకుంది.

మరోవైపు కొన్ని రోజులుగా వెంకట్ రెడ్డి తీరుపై మునుగోడు కాంగ్రెస్ లో వ్యతిరేకత కనిపిస్తోంది. కాంగ్రెస్ పార్టీ ఎంపీగా ఉంటూనే.. బీజేపీ విజయం కోసం ఆయన ప్రయత్నాలు చేస్తున్నారనే ఆరోపణలు వచ్చాయి. తన సోదరుడిని గెలిపించాలని ఆయన కొందరు కాంగ్రెస్ నేతలకు ఫోన్ చేసి చెప్పారనే వార్తలు వచ్చాయి.  వెంకట్ రెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని కొందరు కాంగ్రెస్ స్థానిక లీడర్లు డిమాండ్ చేశారు. దీంతో సోదరుడి బాటలోనే వెంకట్ రెడ్డి కూడా త్వరలో బీజేపీలో చేరుతారనే టాక్  వచ్చింది. అయితే వెంకట్ రెడ్డి మాత్రం తాను కాంగ్రెస్ పార్టీని వీడేది లేదని చెప్పారు. పార్టీ మారనని చెబుతూనే.. బీజేపీ గెలుపు కోసం పని చేస్తుడంటంతో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిపై కాంగ్రెస్ కేడర్ అసహనం వ్యక్తం చేస్తోంది.

మరోవైపు మునుగోడు ఉప ఎన్నికను సవాల్ గా తీసుకున్న పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఏం చేయబోతున్నారన్నది ఆసక్తిగా మారింది. వెంకట్ రెడ్డి మునుగోడులో ప్రచారం చేయరని ముందుగానే ఊహించిన రేవంత్ రెడ్డి.. అందుకు అనుగుణంగా ప్లాన్ రెడీ చేశారని తెలుస్తోంది.  

Also Read: Mulayam Singh Yadav: 60 ఏళ్ల రాజకీయం.. 18 ఎన్నికలు.. ప్రధాని పదవిని చేజార్చుకున్న యోధుడు! ములాయం అందరికి ఆదర్శం..

Also Read: Delhi Liquor Scam: లిక్కర్ స్కాంలో ఎమ్మెల్సీ కవిత అనుచరుడు అరెస్ట్..  నెక్స్ట్ ఎవరో?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook 

Trending News