హైదరాబాద్: లక్షలు, కోట్లు కుమ్మరించి వ్యాపారం చేసే చోట ఎలుకలు కనిపిస్తే.. ఎలుకే కదా అని లైట్ తీసుకోవద్దు అని నిరూపించిన ఘటన ఇది. ఎందుకంటే ఒక ఎలుక చేసిన పనికి ఓ వ్యక్తి కోటి రూపాయలకుపైగా నష్టపోవాల్సి వచ్చింది ( Rat caused major fire accident ). హైదరాబాద్‌లోనే చోటుచేసుకున్న ఈ ఘటన వివరాల్లోకి వెళ్తే.. దాదాపు ఆరు నెలల క్రితం.. అంటే ఈ ఏడాది ఫిబ్రవరి 8న ముషీరాబాద్‌లోని మిత్రా మోటార్స్ అనే ఓ కార్ సర్వీస్ సెంటర్‌లో అర్ధరాత్రి భారీ అగ్నిప్రమాదం ( Fire accident ) జరిగిన సంగతి గుర్తుండే ఉంటుంది. ఈ అగ్ని ప్రమాదం కారణంగా ఆ సర్వీస్ సెంటర్ యజమాని కోటికిపైగా నష్టపోయాడు. అప్పట్లో ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేసిన పోలీసులు.. ఈ ప్రమాదానికి షార్ట్ సర్క్యూటే ( Short circuit ) కారణమై ఉంటుందని తేల్చేశారు. ఐతే ఈ అగ్ని ప్రమాదం జరిగిన సర్వీస్ సెంటర్‌లో సీసీటీవీ విజువల్స్‌ని క్షుణ్ణంగా పరిశీలించిన ఓ ప్రముఖ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబోరేటరి (  Forensic science labs ).. ఈ అగ్ని ప్రమాదానికి అసలు కారణం షార్ట్ సర్క్యూట్ కాదు.. ఎలుకే ఈ ఆఫీసు కొంపకు నిప్పటించింది అని తేల్చేశారు. వినడానికి కాస్త విచిత్రంగానే ఉన్నప్పటికీ ఎలుకే ఈ అగ్ని ప్రమాదానికి కారణమైందనే ఆధారాలతో కూడిన ఫోటోలను సదరు ఫోరెన్సిక్ సైన్స్ సంస్థ బయటపెట్టింది. Also read : IPL 2020 logo: ఐపిఎల్ 2020 కొత్త లోగో వచ్చేసింది


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

[[{"fid":"191156","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]


భారీ అగ్నిప్రమాదం జరిగిన ఆఫీసులో ఫిబ్రవరి 7న ఉదయం 10 గంటలకు పూజ ( Pooja ) కోసం ఓ ఉద్యోగి దీపం వెలిగించిన దృశ్యాలు సీసీటీవీ కెమెరాలో ( CCTV camera ) నమోదయ్యాయి. గదిలో పెద్దగా గాలి వీయకపోవడంతో ఆ దీపం రాత్రి వరకు ఆరకుండా అలా వెలుగుతూనే ఉంది. రాత్రి వేళ ఆఫీస్ మూసేసి సిబ్బంది ఎవరి ఇంటికి వాళ్లు వెళ్లిపోయారు. ఆ తర్వాతే అసలు ఘోరం జరిగిపోయింది. Also read : SP Balasubrahmanyam: విషమంగానే బాలు ఆరోగ్య పరిస్థితి


[[{"fid":"191157","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"2":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"2"}}]]


అర్ధరాత్రి 11:51 సమయంలో సర్వీస్ సెంటర్‌లోని కస్టమర్ సర్వీస్ రూంలో ఓ టేబుల్‌పై ఎలుక ( Rat in office ) తచ్చాడుతూ కనిపించింది. 11:55కి ఆ ఎలుక నిప్పులాంటి వస్తువు నోట కర్చుకుని తిరిగిన దృశ్యాలు కూడా సీసీటీవీలో రికార్డయ్యాయి. అలా ఆ ఎలుక ఆ నిప్పు లాంటి వస్తువును తీసుకెళ్లి ఓ కుర్చీపై వదిలేయడం కూడా ఈ దృశ్యాల్లో ( CCTV visuals ) కనిపించింది. అది బహుశా పూజ కోసం వెలిగించిన దీపంలోని వొత్తి అయ్యుంటుందని.. ఆ తర్వాత 5 నిమిషాల వ్యవధిలోనే కుర్చీలో మంటలు ఎగిసిపడటం.. ఆ అగ్నికీలలు సర్వీస్ సెంటర్ లోని ఫర్నిచర్ మొత్తానికి వ్యాపించడం క్షణాల్లోనే జరిగిపోయిందని ఫోరెన్సిస్ సైన్స్ ల్యాబ్ అభిప్రాయపడింది. Also read : COVID-19: ఏపీలో 3000 దాటిన కరోనా మృతుల సంఖ్య


[[{"fid":"191158","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"3":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"3"}}]]


అలా వ్యాపించిన మంటలు కింది అంతస్తుకు కూడా అంటుకోవడంతో అక్కడే సర్వీస్ కోసం ఇచ్చిన మూడు కార్లు, ఖరీదైన ఫర్నిచర్ కాలి బూడిదయ్యాయి. దీంతో సర్వీస్ సెంటర్ యజమానికి కోటి రూపాయలకు పైగా నష్టం వాటిల్లింది.


[[{"fid":"191159","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"4":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"4"}}]]


ఇంత పెద్ద భారీ అగ్నిప్రమాదం వెనుక ఓ చిన్న ఎలుక ఉందంటే ఆశ్చర్యంగానే ఉంది కదూ..!! Also read :  MS Dhoni reply to PM Modi: ప్రధాని లేఖపై స్పందించిన ధోనీ