CDFD Jobs: నిరుద్యోగులకు భారత ప్రభుత్వ సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ శుభవార్తను చెప్పింది. హైదరాబాద్‌ ఉప్పల్‌లోని సీడీఎఫ్‌డీ(CDFD) పలు పోస్టులను భర్తీ చేయనున్నారు.ఈమేరకు దరఖాస్తులను కోరుతోంది. ఈపోస్టులకు పదోతరగతి, ఇంటర్, డిగ్రీ, బీటెక్, ఎమ్మెస్సీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. 25 నుంచి 30 ఏళ్ల అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అర్హులవుతారు. పోస్టులను బట్టి నెలకు జీతం రూ.30 వేల 789 నుంచి రూ.77 వేల 113 ఉంటుందని సీడీఎఫ్‌డీ తెలిపింది. వివరాలకు www.cdfd.org.in వెబ్‌సైట్ చూడాలని పేర్కొంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇప్పటికే తెలంగాణలో కొలువుల జాతర కొనసాగుతోంది. 80 వేల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేస్తామని ఇప్పటికే అసెంబ్లీలో సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఇందులోభాగంగా విడతల వారిగా నోటిఫికేషన్లు వస్తున్నాయి. ఇప్పటికే పోలీసులు ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ ప్రక్రియ పూర్తైంది. నిన్న తెలంగాణ ఆర్టీసీ సైతం ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని డిపోల్లో అప్రెంటీస్‌ పోస్టులను భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. ఈమేరకు నోటిఫికేషన్‌ విడుదల చేసింది.


అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను స్వీకరిస్తోంది. దరఖాస్తుల ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీత భత్యాలు, ఎంపిక విధానం వంటి అంశాలపై అధికారిక ప్రకటనను విడుదల చేసింది. మొత్తం 300 అప్రెంటీస్‌ పోస్టులను భర్తీ చేయనున్నారు. వీటిలో ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్, డిప్లొమా గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ పోస్టులు ఉన్నాయి. ఎంపిక అయిన వారికి మూడేళ్ల పాటు ట్రైనింగ్ ఇవ్వనున్నారు. జులై 1 నాటికి అభ్యర్థుల వయసు 18 నుంచి 35 ఏళ్లకు మించరాదని ఆర్టీసీ స్పష్టం చేసింది.


ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్ అభ్యర్థులకు మొదటి ఏడాది నెలకు రూ.18 వేలు ఇవ్వనున్నారు. రెండో ఏడాది నెలకు రూ.20 వేలు ఇస్తారు. మూడో ఏడాది నెలకు రూ.22 వేల చొప్పున జీతాలు చెల్లిస్తామని ఆర్టీసీ అధికారులు తెలిపారు. డిప్లొమా గ్రాడ్యుయేట్ అభ్యర్థులకు మొదటి ఏడాది నెలకు రూ.16 వేలు, రెండో ఏడాది నెలకు రూ.17500, మూడో ఏడాది నెలకు రూ.19 వేల జీతాలు చెల్లించనున్నారు. గుర్తింపు పొందిన విద్యా సంస్థల నుంచి ఇంజినీరింగ్ డిప్లొమా, బీఈ, బీటెక్‌లో ఉత్తీర్ణత సాధించిన వారు ఈపోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. ఈనెల 15 వరకు దరఖాస్తులను స్వీకరిస్తారు.


Also read:Gang Rape Update: మైనర్ బాలికపై ఎమ్మెల్యే కొడుకు అత్యాచారం! ఆధారాలు చూపించిన రఘునందన్ రావు..


 


Also read: Jubilee Hills Gang Rape: జూబ్లీహిల్స్ గ్యాంగ్ రేప్... సీబీఐ విచారణకు బండి సంజయ్ డిమాండ్...


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook