Jubilee Hills Gang Rape: జూబ్లీహిల్స్ గ్యాంగ్ రేప్... సీబీఐ విచారణకు బండి సంజయ్ డిమాండ్...

Jubilee Hills Gang Rape: హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లో మైనర్ బాలికపై గ్యాంగ్ రేప్ ఘటన సంచలనం రేకెత్తిస్తోంది. ఈ ఘటనలో ప్రముఖ రాజకీయ నేతల పిల్లలు ఉన్నట్లు ప్రచారం జరుగుతుండటంతో ఈ కేసు సంచలనాత్మకంగా మారింది.

Written by - ZH Telugu Desk | Last Updated : Jun 4, 2022, 02:40 PM IST
Jubilee Hills Gang Rape: జూబ్లీహిల్స్ గ్యాంగ్ రేప్... సీబీఐ విచారణకు బండి సంజయ్ డిమాండ్...
Live Blog

Jubilee Hills Gang Rape: హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లో మైనర్ బాలికపై గ్యాంగ్ రేప్ ఘటన సంచలనం రేకెత్తిస్తోంది. ఈ ఘటనలో ప్రముఖ రాజకీయ నేతల పిల్లలు ఉన్నట్లు ప్రచారం జరుగుతుండటంతో ఈ కేసు సంచలనాత్మకంగా మారింది. జూబ్లీహిల్స్‌లోని ఓ పబ్‌లో పార్టీకి హాజరైన ఆ బాలికను కొంతమంది టీనేజర్లు బలవంతంగా కారులో తీసుకెళ్లి గ్యాంగ్ రేప్‌కు పాల్పడ్డారు. మే 28న ఈ ఘటన జరగ్గా.. దీనిపై బాలిక తండ్రి మే 31న పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత రెండు రోజులకు కానీ ఈ ఘటన బయటకు వెల్లడికాలేదు. ఇందులో హోంమంత్రి మనవడు, ఎమ్మెల్యే కుమారుడు ఉన్నట్లు జరుగుతున్న ప్రచారాన్ని పోలీసులు ఖండించారు. ఈ ఘటనలో నిందితులు ఏ స్థాయి వ్యక్తులైనా వదిలిపెట్టే ప్రసక్తి లేదని చెబుతున్నారు.

మరోవైపు, విపక్ష పార్టీలు ఈ ఘటన విషయంలో టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తున్నాయి. అత్యాచార ఘటనలో టీఆర్ఎస్ నేతల పిల్లల ప్రమేయం ఉందని ఆరోపిస్తున్నాయి. ఘటనపై సీబీఐ విచారణ జరిపించాల్సిందిగా కోరుతూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు లేఖ రాశారు. ఇది ముమ్మాటికీ టీఆర్ఎస్ ప్రభుత్వం, పోలీసుల వైఫల్యమేనని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. టీఆర్ఎస్ పాలనలో ఆరేళ్ల పాపకు, అరవై ఏళ్ల బామ్మకు రక్షణ కరువైందని వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు షర్మిల విమర్శించారు. సంచలనంగా మారిన ఈ కేసు ఎప్పుడు ఏ మలుపు తీసుకుంటుందోనన్న ఉత్కంఠ నెలకొంది. ఈ నేపథ్యంలో కేసుకు సంబంధించి ఎప్పటికప్పుడు లైవ్ అప్‌డేట్స్ ఇక్కడ తెలుసుకోండి... 

4 June, 2022

  • 14:38 PM

    జూబ్లీహిల్స్‌లో మైనర్ బాలికపై గ్యాంగ్ రేప్ కేసులో పోలీసులు మరో ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు. ఉమర్‌ఖాన్, మరో ఇద్దరు మైనర్లను కర్ణాటకలో అదుపులోకి తీసుకున్నారు.

  • 13:31 PM

    జూబ్లీహిల్స్‌లో మైనర్ బాలికపై గ్యాంగ్ రేప్ కేసును సీబీఐకి అప్పగించాలని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క డిమాండ్...

    రాష్ట్ర రాజధానిలో మైనర్ బాలికపై అత్యాచారం దురదృష్టకరం. పబ్ ,డ్రగ్  కల్చర్‌ని నియంత్రించలేని  కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ ఘటనకు బాధ్యత వహించాలన్న భట్టి...

  • 13:30 PM

    మైనర్ బాలికపై గ్యాంగ్ రేప్ ఘటనను నిరసిస్తూ డీజీపీ కార్యాలయంలోకి చొచ్చుకెల్లేందుకు యత్నించిన యూత్ కాంగ్రెస్ సభ్యులు..

    గ్రేటర్ హైదరాబాద్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు మోత రోహిత్ ఆధ్వర్యంలో ఆందోళన...

    యూత్ కాంగ్రెస్ నాయకులను అరెస్టు చేసి నాంపల్లి పోలీస్ స్టేషన్ కు తరలింపు...

  • 13:08 PM

    జూబ్లీహిల్స్ మైనర్ బాలికపై రేప్ కేసులో ఎమ్మెల్యే కొడుకు ప్రమేయం ఉందన్న బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు

    పబ్‌కు ఎమ్మెల్యే కొడుకు మెర్సిడెజ్ బెంజ్ కారులో వచ్చినట్లు వెల్లడి

    ఫోటోలను బయటపెట్టిన రఘునందన్ రావు... నిందితులను ఎందుకు సీక్రెట్‌గా ఉంచుతున్నారని పోలీసులపై ఫైర్ 

  • 12:43 PM

    తెలంగాణలో శాంతిభద్రతల సమస్యపై చర్చించేందుకు ప్రభుత్వం అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలి. రాష్ట్రంలో పబ్బులను వెంటనే మూసివేయాలి. - బండి సంజయ్ 

  • 12:42 PM

    రాష్ట్రప్రభుత్వం సీబీఐ విచారణ జరిపించకపోతే బాధితులకు అండగా నిలిచేందుకు బీజేపీ న్యాయ పోరాటం చేస్తుంది - బండి సంజయ్ 

  • 12:41 PM

    మైనర్‌ బాలికపై గ్యాంగ్ రేప్ ఘటనలో అధికారపక్షానికి దగ్గరగా వున్నవారు, టీఆర్‌ఎస్‌‌కు మిత్రపక్షమైన ఎంఐఎం పార్టీకి చెందిన కుటుంబ సభ్యుల ప్రమేయం ఉంది - బండి సంజయ్

  • 12:39 PM

    ప్రభుత్వం ఆ అపవాదును తొలగించుకోవాలంటే సీబీఐ విచారణకు ఆదేశించాలి -బండి సంజయ్

    మైనర్ బాలికపై గ్యాంగ్ రేప్ కేసులో రాష్ట్రప్రభుత్వం ఎటువంటి బేషజాలకు పోకుండా సీబీఐ విచారణకు ఆదేశించి ప్రభుత్వం తమ నిర్ధోషిత్వాన్ని, నిందితులకు అండగా లేమనే అపవాదును తొలగించుకోవాలని సంజయ్ డిమాండ్ చేశారు.

  • 12:37 PM

    జూబ్లీహిల్స్‌లో మైనర్ బాలికపై గ్యాంగ్ రేప్ కేసులో పోలీసుల తీరును తప్పు పట్టారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. నిందితులను రక్షించేందుకు పోలీస్ శాఖ కేసును పక్కదోవ పట్టిస్తోందన్నారు. ఈ కేసులో సీబీఐ విచారణకు డిమాండ్ చేస్తూ బండి సంజయ్ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు లేఖ రాశారు.

Trending News