Munugode Bypoll: తెలంగాణలో అత్యంత కీలకంగా మారిన మునుగోడు ఉప ఎన్నికలో ట్విస్టుల మీద ట్విస్టులు జరుగుతున్నాయి. ఎన్నికల కమిషన్ సీరియస్ చర్యలకు దిగుతోంది. గుర్తుల వివాదంలో రిటర్నింగ్ ఆఫీసర్ పై వేటు వేసిన సీఈసీ.. తాజాగా అధికార టీఆర్ఎస్ పై కేసు నమోదు చేసింది. మునుగోడు ఉప ఎన్నికను సవాల్ గా తీసుకున్న టీఆర్ఎస్.. గ్రామానికో ఎమ్మెల్యేను ఇంచార్జ్ గా నియమించింది. చౌటుప్పల్ మండలం మల్కాపూర్ గ్రామానికి ఆర్మూరు ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఇంచార్జ్ గా ఉన్నారు. మల్కాపూర్ లో పార్టీకి లీడ్ తెచ్చేందుకు శ్రమిస్తున్న జీవన్ రెడ్డి.. ఓటర్ల ప్రసన్నం కోసం నానా పాట్లు పడుతున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మల్కాపూర్ ఓటర్ల ప్రసన్నం కోసం కొత్త ఎత్తు వేశారు ఎమ్మెల్యే జీవన్ రెడ్డి. ౩ వందల మంది ఓటర్లను యాదాద్రి శ్రీ లక్ష్మినరసింహ స్వామి దర్శనానికి  తీసుకెళ్లారు. 12 ఆర్టీసీ బస్సుల్లో ఓటర్లను నేరుగా కొండపైకి తీసుకెళ్లారు ఎమ్మెల్యే జీవన్ రెడ్డి. స్వామి వారి సేవలను నిలిపివేసి మరీ మునుగోడు ఓటర్లకు దర్శనం కల్పించారు. లక్ష్మీనరసింహ స్వామి సాక్షిగా కారు గుర్తుకే ఓటు వేస్తామని  ఒట్టు వేయించుకున్నారని చెబుతున్నారు. దర్శనం తర్వాత 3 వందల మందికి ఫుల్ ధావత్ ఇచ్చారు ఎమ్మెల్యే జీవన్ రెడ్డి.  40 మేకలను కోసి లంచ్ ఏర్పాటు చేశారని సమాచారం. ఇందుకు సంబంధించిన వీడియోలు వైరల్ గా మారాయి. మూడు వందల మంది ఓటర్లను యాదాద్రికి  తీసుకెళ్లి ప్రమాణం చేయించిన ఘటనపై ఈసీ స్పందించింది.  ఎన్నికల కోడ్ ఉల్లంఘించారంటూ టీఆర్ఎస్ నేతలపై కేసు నమోదు చేయాలని ఆదేశించింది. యాదాద్రి ఖర్చును మొత్తం టీఆర్ఎస్ అభ్యర్థి ఖాతాలో వేయాలని ఆదేశించింది.


అటు మునుగోడు బైపోల్ మాజీ రిటర్నింగ్ అధికారి జగన్నాథరావుపై చర్యలు తీసుకోవాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. తనకు లేని అధికారంతో గుర్తు మార్పు చేశారని జగన్నాథరావు పై ఈసీ సీరియస్ అయింది. దీంతో సీఈసీ ఆదేశాలతో జగన్నాథరావుపై చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఎన్నికల అధికారి వికాస్ రాజ్ ప్రభుత్వానికి సిఫారసు చేశారు. ఇక బ్యాలెట్ పేపర్ లో షిప్ కు బదులుగా  బోట్ విత్ మ్యాన్ అండ్ సెయిల్ సింబల్ ముద్రించిన ముద్రించిన విషయంలోనూ ఈసీ సీరియస్ యాక్షన్ తీసుకుంది. ఇందుకు బాధ్యుడైన చౌటుప్పల్ ఎమ్ఆర్వోపై సస్పెన్షనే వేటు వేసింది. బ్యాలెట్ ముద్రణలో పాల్గొన్న ఇతర అధికారుల నుంచి వివరణ కోరింది. షిప్ గుర్తును కోరిన అభ్యర్థికి అదే గుర్తును కేటాయించింది ఎన్నికల సంఘం. 


Read Also: AP Capital: మూడు రాజధానులపై వైసీపీ రాజీనామా స్కెచ్.. టీడీపీ కౌంటర్ ఏంటో?


Read Also: Roja Selvamani Marriage pic : రోజా పెళ్లి ఫోటో వైరల్.. నాడు నేడు.. సెల్వమణి బర్త్ డే స్పెషల్ పిక్



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook