Amit Sha On Bandi Sanjay:తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ రెండో విడత ప్రజా సంగ్రామ యాత్ర ముగిసింది. ఏప్రిల్ 14న గద్వాల జిల్లా ఆలంపూర్ లో యాత్ర ప్రారంభించిన సంజయ్.. మే14న తుక్కుగూడలో ముగించారు. సంజయ్ పాదయాత్ర ముగింపు సభకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా వచ్చారు. ఈ సందర్భంగా తుక్కగూడలో భారీ బహిరంగ సభ నిర్వహించారు. ఈ సభకు రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి జనాలను తరలించారు కమలం నేతలు. తుక్కుగూడ సభ ఊహించినదాని కంటే సక్సెస్ అయిందని తెలంగాణ బీజేపీ నేతలు చెబుతున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇక బహిరంగ సభలో మాట్లాడిన అమిత్ షా.. తెలంగాణ ముఖ్యమంత్రి  కేసీఆర్ ను తీవ్రస్థాయిలో టార్గెట్ చేశారు. తెలంగాణలో నిజాంను మించిన నియంత పాలన సాగుతుందన్నారు. కుటుంబ పాలనతో తెలంగాణ తీవ్రంగా నష్టపోతుందని చెప్పారు. కొడుకు, కూతురుకు అధికారం ఇచ్చిన కేసీఆర్.. సర్పంచ్‌ల‌కు మాత్రం అధికారం ఇవ్వ‌లేద‌ని అమిత్ షా విమ‌ర్శించారు. తెలంగాణ‌ ప్రజలు కేసీఆర్ ను తరిమికొట్టడం ఖాయమన్నారు. నీళ్లు- నియామకాల నినాదంతో పవర్ లోకి వచ్చిన కేసీఆర్.. గత ఎనిమిది ఏళ్లుగా చేసిందేమి లేదన్నారు. బీజేపీ ప్రభుత్వం రాగానే నీళ్లు ఇస్తామని, నియామకాలు చేపడుతామని అమిత్ షా ప్రకటించారు.  సీఎంగా కేసీఆర్ ఇంకా కొనసాగితే.. తెలంగాలో మరో బెంగాల్ మారుతుందని అమిత్ షా అన్నారు. వరి ధాన్యం కొనుగోళ్లపైనా కేంద్ర హోంమంత్రి క్లారిటీ ఇచ్చారు. రైతుల నుంచి ధాన్యం కొన‌లేక‌పోతే త‌క్ష‌ణ‌మే సీఎం ప‌ద‌వికి కేసీఆర్ రాజీనామా చేయాల‌ని డిమాండ్ చేశారు. కేసీఆర్ లాంటి అస‌మ‌ర్థ సీఎంను త‌న రాజ‌కీయ జీవితంలో ఎప్పుడూ చూడ‌లేద‌ంటూ హాట్ కామెంట్స్ చేశారు అమిత్ షా.


తుక్కుగూడ బహిరంగ సభలో బండి సంజయ్ ని ఆకాశానికెత్తారు అమిత్ షా.  సంజ‌య్ సాగించిన పాద‌యాత్ర అధికారం కోస‌మో, ఒక పార్టీ నుంచి మ‌రో పార్టీకి అధికార బ‌దలాయింపు కోస‌మో కాద‌ని చెప్పారు. బ‌డుగు, బ‌ల‌హీన వర్గాల కోసమే ప్రజా సంగ్రామ యాత్ర సాగింద‌న్నారు. కేసీఆర్ ను ఓడించడానికి తాను తెలంగాణ‌కు రావాల్సిన అవ‌స‌రం లేద‌ని అమిత్ షా స్పష్టం చేశారు. కేసీఆర్‌ను ఇంటికి పంపేందుకు బండి సంజ‌య్ ఒక్క‌డే చాల‌న్నారు అమిత్ షా. ఇదే ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చగా మారింది. పార్టీ ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన సభలో బండి సంజయ్ ను అమిత్ షా పొగడటం.. కేసీఆర్ ను ఓడించడానికి సంజయ్ ఒక్కడు చాలని చెప్పడం చర్చనీయాంశంగా మారింది. తెలంగాణలో బీజేపీ గెలిస్తే సంజయే ముఖ్యమంత్రి అవుతారని.. అమిత్ షా సిగ్నల్ ఇచ్చారని రాజకీయ నిపుణులు చెబుతున్నారు. ఇటీవలే కేంద్రంలో మళ్లీ ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీయే ఉంటారని అమిత్ షా కామెంట్ చేశారు. కేంద్రంలో లాగానే తెలంగాణ విషయంలోనూ ముఖ్యమంత్రి విషయంలో అమిత్ షా తన ప్రసంగంలో క్లారిటీ ఇచ్చారని అంటున్నారు. 


READ ALSO:Gaddar Meets Amit Shah: బీజేపీ బహిరంగ సభలో ప్రత్యక్షమైన గద్దర్... అమిత్ షాను కలిసిన ప్రజా యుద్ధ నౌక... 


READ ALSO: KA Paul vs Pawan Kalyan: కేఏ పాల్, పవన్ కళ్యాణ్‌లలో ఎవరు గొప్ప, ఎందుకీ చర్చ ?


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి