KA Paul vs Pawan Kalyan: తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో ఇటీవల జరిగిన ఆసక్తికరమైన పరిణామాలు..అంతకంటే కీలకమైన చర్చకు దారి తీశాయి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కంటే కేఏ పాల్ గొప్పవాడా అనేదే ఈ చర్చ. ఆశ్చర్యంగా ఉందా..లెట్స్ వాచ్ ద స్టోరీ..
జాతీయ రాజకీయాలు ఎప్పుడూ ఆశ్యర్యకరంగానే ఉంటుంటాయి. వివిధ రాష్ట్రాలకు సంబంధించి జాతీయ పార్టీ నేతల వైఖరి అంతకంటే కీలకంగా ఉంటాయి. తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఢిల్లీలో జరిగిన ఓ పరిణామం ఇదే చర్చకు కారణమైంది. పాస్టర్ టర్న్డ్ పొలిటీషియన్ కేఏ పాల్ వర్సెస్ యాక్టర్ టర్న్డ్ పొలిటీషియన్ పవన్ కళ్యాణ్ మధ్య ఆసక్తికరమైన వాదనకు దారి తీస్తోంది.
ఏమైంది అసలు
జాతీయ రాజకీయాల్లో ప్రస్తుతం ప్రధాని నరేంద్ర మోదీ తరువాత అంతటి ప్రాముఖ్యత ఉన్న నేత హోంమంత్రి అమిత్ షా. పార్టీలో, జాతీయ రాజకీయాల్లో అమిత్ షాకు చాలా ప్రాధాన్యత ఉంది. అటువంటి వ్యక్తి అపాయింట్మెంట్ లభించడం కష్టమే. అయితే ఇటీవల మాజీ మత ప్రభోధకుడు, ఓ రాజకీయ పార్టీ అధినేత కేఏ పాల్..అమిత్ షాను కలుసుకున్నారు. ఇద్దరి మధ్య ఏం చర్చలు జరిగాయనేది అప్రస్తుతం. కానీ కేఏ పాల్ వంటి వ్యక్తికి అమిత్ షా అపాయింట్మెంట్ అంత సులభంగా ఎలా లభించిందనేది కీలకమైన ప్రశ్నగా మారింది. ఎందుకంటే..ఈ మధ్య కాలంలో బీజేపీ భాగస్వామ్య పార్టీ జనసేన అధినేత పవన్ కళ్యాణ్..అమిత్ షా అపాయింట్మెంట్ కోసం ప్రయత్నించి విఫలమయ్యారు. ఢిల్లీలో 3 రోజులు ప్రయత్నించి కూడా అమిత్ షాను కలవలేకపోయారు.
అటువంటిది కేఏ పాల్ అంత సులభంగా ఎలా కలవగలిగారనేదే ఇప్పుడు చర్చకు దారి తీస్తోంది. కేఏ పాల్ కూడా ప్రజాదరణ కలిగిన వ్యక్తే ..ప్రపంచవ్యాప్తంగా పెద్దపెద్ద నేతలతో సంబంధాలున్నాయి. అయితే రాజకీయాల్లోకి వచ్చిన తరువాత అతని గ్రాఫ్ అమాంతంగా పడిపోయింది. అదే సమయంలో పవన్ కళ్యాణ్ రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ బలమైన, ప్రజాదరణ కలిగిన వ్యక్తిగా ఉన్నారు. అదే సమయంలో బీజేపీకు మద్దతుదారుడు కూడా. అటువంటిది పవన్ కళ్యాణ్‌కు అమిత్ షా అపాయింట్మెంట్ లభించకుండా..కేఏ పాల్‌కు దొరకడమనేది ఎవరికీ అంతుబట్టడం లేదు.
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పవన్ కళ్యాణ్ కంటే కేఏ పాల్‌కు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చిందనే కామెంట్లు జోరందుకుంటున్నాయి. బీజేపీకు మద్దతిస్తున్నా తమను నిర్లక్ష్యం చేశారనేది జనసేన అభిమానుల ఆరోపణ. ప్రస్తుతం అమిత్ షా..తెలంగాణపై దృష్టి సారించడంతో పాటు కేసీఆర్‌కు కౌంటర్ చేసే అవకాశాల కోసం చూస్తున్న తరుణంలో..కేసీఆర్‌తో వైరుద్యముండి స్థానిక బీజేపీ నేతలతో మంచి సంబంధాలు కలిగిన కేఏ పాల్ ప్రత్యామ్నాయంగా కన్పించి ఉండవచ్చనేది మరి కొంతమంది వాదన. అదే సమయంలో పవన్ కళ్యాణ్ ఇంకా రాజకీయాల్లో తప్పటడుగులు వేస్తూనే ఉన్నారనేది ఇంకో విమర్శ.
అటు ఏపీ విషయానికొస్తే..ఏపీలోని అధికార పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బీజేపీకు అనుకూలంగా ఉండటంతో పాటు పార్టీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్..ప్రధాని నరేంద్ర మోదీ, అమిత్ షాల దృష్టిలో మంచి ఇమేజ్ కలిగి ఉన్నారు. కేంద్రానికి జగన్ మద్దతు అవసరం. సోనియా కుటుంబంతో జగన్‌కు ఉన్న వైరుద్యం బీజేపీకు లాభించే అంశం. అదే సమయంలో పవన్ కళ్యాణ్‌కు బీజేపీకు మద్దతివ్వడం తప్ప మరో ప్రత్యామ్నాయం లేదు. అందుకే పవన్ కళ్యాణ్ కంటే కేఏ పాల్ గొప్పోడా అనే చర్చ ప్రారంభమైంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.