Kishan Reddy Letter To CM: కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి సీఎం రేవంత్‌ రెడ్డికి రాసిన బహిరంగ లేఖలో హైడ్రా వ్యవహరిస్తున్న తీరుపై ప్రభుత్వాన్ని ఎండగట్టారు. గతంలో ప్రభుత్వమే అనుమతించింది, మళ్లీ ప్రభుత్వమే పేదల, మధ్యతరగతి వారి ఇళ్లను ప్రత్యామ్నాయ మార్గం చూపకుంటా కూల్చివేతలకు పాల్పడితే ఎలా అని ప్రశ్నించారు. మూసీ ప్రక్షాళన పేరుతో ఇప్పటికే పోలీసుల బందోబస్తు మధ్యలో అక్రమంగా నిర్మించారు అంటూ ఇళ్లపై మార్కింగ్‌ కూడా వేశారు. అయితే, పేదలకు ప్రత్యామ్నాయం చూపకుండా ఇలా కూల్చివేతలకు పాల్పడకూడదని సీఎం రేవంత్‌ రెడ్డికి లేఖ సుదీర్ఘ లేఖ రాశారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అందరికీ న్యాయం జరిగేలా ముఖ్యమంత్రి తీరు ఉండాలి కానీ, ఇలా కూల్చివేతలకు పాల్పడటం సమంజసం కాదు. గత ప్రభుత్వాలు అనుమతి ఇచ్చాయి. ప్రభుత్వం మారిన తర్వాత కూల్చివేతలు ఎలా చేస్తారని ప్రశ్నించారు. బ్యాంకు రుణం తీసుకుని నిర్మాణాలు చేపట్టారు. అలాంటి వారి పరిస్థితి ఏంటి? పేద, మధ్య తరగతి కుటుంబాలు కట్టుబట్టలతో రోడ్డు మీద పడాల్సిన దుస్థితి ఏర్పడిందన్నారు కేంద్ర మంత్రి.


హైడ్రాపై తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డికి కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. సహజ న్యాయ సూత్రాలు పాటించాకుండా ఇలా హైడ్రాతో అడ్డగోలుగా వ్యవహరిస్తున్నారు. అధికారిక పట్టాలు ఉన్న ఇళ్లను కూడా బుల్డోజర్లతో కూల్చడం న్యాయం కాదన్నారు. పేదలపై హైడ్ర ప్రతాపం చూపకుండా బాధితులతో చర్చించాలని సూచించారు. ఒక్కసారిగా ఇళ్లు కోల్పోతే వారు తీసుకున్న బ్యాంక్‌ రుణం, ఇళ్లు లేనివారు ఎటు వెళ్తారు అన్ని సీఎంను ప్రశ్నించారు. ఈ విధంగా కేంద్ర మంత్రి ముఖ్యమంత్రికి సుదీర్ఘ లేఖ రాసి ఎండగట్టారు. కొత్త నిర్మాణాలు చేపట్టాలి, డబుల్‌ బెడ్‌రూమ్‌లు కట్టి పేదలకు ఇవ్వాలి కానీ, ఇలా ఉన్న ఇళ్లులను కూలగొట్టడం ఏంటి? 


జియో 98 రోజుల సరికొత్త రీఛార్జీ ప్లాన్‌.. 5జీ సేవలతో ప్రతిరోజూ 2 జీబీ డేటా ఎంత తక్కువ ధర తెలుసా?  


మూసీ పరివాహాక ప్రాంతాల్లో ఉన్నవారికి కూడా ముందుగా ప్రత్యామ్నాయ మార్గం చూపించిన తర్వాత కూల్చివేతలు చేయాలి. ముందుగానే ఫెన్సింగ్‌, మార్కింగ్‌ చేయడం ఎంత వరకు సబబు, పేద మధ్య తరగతి వారిని దృష్టిలో పెట్టుకుని ఈ లేఖ రాస్తున్నట్లు చెప్పారు కిషన్‌ రెడ్డి. ఇంకా పలు అంశాలపై కూడా రాసుకొచ్చారు. 30 ఏళ్ల క్రితం ఆ ప్రభుత్వమే అనుమతిస్తే, నిర్మించిన ఇళ్లు మళ్లీ వారి హయాంలోనే కూలగొట్టడం ఏంటి. ఏడు లక్షల ఇళ్లు నిర్మిస్తామని చెప్పి, వారి ఇళ్లు కూల్చివేస్తున్నారు. గత ప్రభుత్వం కూడా ఇచ్చిన మాటను నిలబెట్టుకోలేదు. ఈ ప్రభుత్వం కూడా అలానే ప్రవర్తిస్తుంది.హైడ్రాకు ఉన్న నిబద్ధత ఏంటి? పార్టీ తరఫున మేము అన్ని రకాలుగా మేధావుల ఆలోచనల నేపథ్యంలో ఈ లేఖ రాస్తున్నట్లు కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి చెప్పుకొచ్చారు. ఇక ఈ లేఖపై సీఎం రేవంత్ ఎలా  స్పందిస్తారో చూడాలి.


ఈ ఒక్క ఆకు జుట్టు మొత్తాన్ని నల్లగా మారుస్తుంది.. తెల్ల జుట్టుకు చెక్‌ పెడుతుంది..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.