Reliance Jio 98 Days Plan: టెలికాం కంపెనీ రిలయన్స్ జియో బీఎస్‌ఎన్‌ఎల్ కు పోటీ ఇస్తూ కొత్త రీఛార్జీ ప్లాన్లను అతి తక్కువ ధరలో అందుబాటులోకి తీసుకువస్తుంది. ఆకర్షణీయమైన ప్లాన్లతో యూజర్లను ఆకట్టుకుంటుంది. ఈ దిగ్గజ టెలికాం ఆపరేటర్ 98 రోజుల వ్యాలిడిటీ ప్లాన్ వివరాలు తెలిస్తే ఎగిరిగంతేస్తారు. ఆ వివరాలు తెలుసుకుందాం.
ఈ ప్లాన్ ధర రూ.999 ఇది రెండూ జియో ప్రీపెయిడ్, పోస్ట్ పెయిడ్ కస్టమర్లకు అందుబాటులో ఉంటుంది. ఇతర ప్లాన్ల మాదిరి 5 జీ సేవల యాక్సెస్ పొందుతారు. ఈ రీఛార్జీ ప్లాన్‌లో ప్రతిరోజూ అపరిమిత కాల్ సౌకర్యం పొందుతారు. 100 ఎస్‌ఎం్‌లు ఉచితం. అంతేకాదు జియో క్లౌడ్, జియో సినిమా, జియో టీవీ యాప్ యాక్సెస్ కూడా పొందవచ్చు.
మీ ప్రాంతంలో జియో 5 జీ కనెక్టివిటీ అందుబాటులో లేకపోయినా వారికి కూడా జియో మరో ఆఫర్ ప్రకటించింది. 2 జీబీ డేటా ప్రతిరోజూ 4 జీ సేవలను పొందవచ్చు.
ఈ ప్లాన్ కొనుగోలు చేయాలంటే జియో వినియోగదారులు అధికారిక వెబ్‌సైట్ www.jio.com లేదా మై జియో యాప్ మీ మొబైల్ ఫోన్ ద్వారా ఈ కొత్త రీఛార్జీ ప్లాన్ కొనుగోలు చేయవచ్చు. ఈ ప్లాన్ యాక్టివేట్ చేసుకోవడానికి రూ.999 చెల్లించాల్సి ఉంటుంది.
అయితే, కొంతమంది ప్రీపెయిడ్ యూజర్లకు ఓటీటీ ప్లాట్‌ఫారమ్స్ కూడా అదనంగా పొందాలని చూస్తారు. అటువంటి వారికి జియో అందిస్తున్న మరో బెస్ట్ రీఛార్జీ ప్లాన్ రూ.1049, రూ.1299 ప్లాన్ ఇందులో మీకు 84 రోజులపాటు వ్యాలిడిటీ వస్తుంది. ప్రతిరోజూ అపరిమిత వాయిస్ కాల్స్, 2 జీబీ డేటా కూడా ఉచితంగా పొందవచ్చు.
రూ.1049 ప్లాన్‌లో మీకు సోనీలైవ్, జీ5 సబ్‌స్క్రీప్షన్ పొందుతారు. రూ.1299 రీఛార్జీ ప్లాన్‌లో నెట్‌ఫ్లిక్స్ మొబైల్ వెర్షన్ 480 పీ కంటెంట్ స్ట్రీమ్ చేసుకోగలరు. ఇదిలా ఉంటే జీయో ఇటీవలె రూ.175 ప్లాన్ కూడా అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇందులో 10 జీబీ డేటా, 28 రోజులపాటు ఓటీటీ ప్లాట్‌ఫారమ్స్ కూడా పొందవచ్చు. ఇందులో మీకు సోనీ లైవ్, జీ5, జియో సినిమా ప్రీమియం,లయన్స్‌గేట్ ప్లే, డిస్కవరీ ప్లస్, సన్ నెక్ట్స్, ప్లానెట్ మరాఠి, చౌపాల్, హాయ్‌చాయిక్ , జియో టీవీ ఉంటాయి.