Kishan Reddy Comments: మాది ప్రజా ప్రభుత్వం..8 ఏళ్లలో ఎన్నో చేశామన్న కిషన్‌రెడ్డి..!
Kishan Reddy Comments: కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం వచ్చాక ఎన్నో సంక్షేమ పథకాలను తీసుకొచ్చామన్నారు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి. 8 ఏళ్ల పాలనలో అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేశామని చెప్పారు.
Kishan Reddy Comments: కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం వచ్చాక ఎన్నో సంక్షేమ పథకాలను తీసుకొచ్చామన్నారు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి. 8 ఏళ్ల పాలనలో అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేశామని చెప్పారు. హైదరాబాద్ పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన..మోదీ వచ్చాక జరిగిన అభివృద్ధిని వివరించారు. బీజేపీ గవర్నమెంట్ రాకముందే కాంగ్రెస్ పదేళ్ల పాలనలో దేశం అస్తవ్యస్తంగా మారిందన్నారు.
దేశంలో అవినీతి కుంభకోణాలు విచ్చలవిడిగా ఉండేవని తెలిపారు. ఎన్డీఏ ప్రభుత్వం వచ్చాక దేశంలో సమూల మార్పులు వచ్చాయని స్పష్టం చేశారు. ఈశ్యాన రాష్ట్రాల్లో బంద్‌లు, రాస్తారోకోలు ఉండేవని..తమ పాలనలో అవేమి లేవన్నారు. పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించే అవకాశం లేకపోవడంతోనే చమురుపై పన్ను భారాన్ని తగ్గించామని పునర్ఘటించారు. రాష్ట్రాలు కూడా నిలదొక్కుకోవాలని కేంద్ర పన్నుల వాటాలో 42 శాతానికి పెంచామని కిషన్‌రెడ్డి గుర్తు చేశారు.
గతంలో కేవలం 30 శాతం మాత్రమే ఉండేదన్నారు. పన్నుల రూపంలో వచ్చే సొమ్మును మౌలిక సదుపాయాల కల్పనకు ఉపయోగిస్తున్నామని స్పష్టం చేశారు. 38 శాతంగా ఉన్న మరుగుదొడ్లను 98 శాతానికి పెంచామని..స్వచ్ఛ భారత్ నినాదాన్ని మారు మోగేలా చేశామని చెప్పారు. 8 ఏళ్ల పాలనలో 180 మెడికల్ కాలేజీలు, 70 ప్రైవేట్ మెడికల్ కాలేజీలను ప్రారంభించామని వెల్లడించారు.
8 ఏళ్ల పాలనలో కీలక సంస్కరణాలను తీసుకొచ్చామన్నారు. నోట్ల రద్దు, 370 ఆర్టికల్ రద్దు వంటి కఠిన నిర్ణయాలను తీసుకున్నామని తెలిపారు. కాశ్మీర్‌లో 370 ఆర్టికల్ రద్దు ద్వారా జిన్నా రాజ్యాంగాన్ని రద్దు చేసి అంబేద్కర్ రాజ్యాంగాన్ని తీసుకొచ్చామని గుర్తు చేశారు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి. 2500 డిఫెన్స్ ఉత్పత్తుల దిగుమతులను నిషేధించామన్నారు. కరోనా సమయంలో ఇతర దేశాలకు ఆదర్శంగా నిలిచామన్నారు.
Also read:IPL 2022 Final GT vs RR Live Updates: మొదటి వికెట్ కోల్పోయిన రాజస్థాన్.. యశస్వి జైస్వాల్ ఔట్!
Also read: TRS Strategy: సీఎం కేసీఆర్ వ్యూహాం మారిందా..ఎన్టీఆర్ రాగం కలిసి వస్తుందా..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook