TRS Strategy: టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్ రూట్ మార్చారా..? ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాల్లో ఆ పార్టీ నేతలు పాల్గొనడానికి గల కారణాలు ఏంటి..? తెలంగాణలో సీమాంధ్ర ఓట్లే టార్గెటా..? టీడీపీని పూర్తిగా తుడిచిపెట్టే వ్యూహామా..? ఉన్నట్టుండి టీఆర్ఎస్ పాచికలు ఎందుకు మారాయి..? ప్రత్యేక కథనం.
తెలంగాణలో పాలిటిక్స్ హాట్‌హాట్‌గా సాగుతున్నాయి. జాతీయ పార్టీల పెద్దల రాకతో మరింత వేడిని రాజేసింది. ఇటీవల టీఆర్ఎస్ పార్టీయే టార్గెట్‌గా ప్రధాని మోదీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలకు టీఆర్ఎస్ మంత్రులు, నేతలు కౌంటర్లు ఇచ్చారు. ఇంతవరకు బాగానే ఉన్నా..నిన్న ఉన్నట్టుండి అన్యూహ పరిణామం చోటు చేసుకుంది. శనివారం ఉమ్మడి రాష్ట్ర మాజీ సీఎం, అగ్ర నటుడు ఎన్టీఆర్ శత జయంతి. తెలుగు రాష్ట్రాల్లో ఈ వేడుకలు ఘనంగా జరిగాయి.
ఎన్టీఆర్ కుటుంబ సభ్యులంతా ఆయన ఘాట్ వద్ద ఘన నివాళి ఆర్పించారు. ఈక్రమంలోనే గతంలో ఎన్నడూ లేవిధంగా తెలంగాణ మంత్రులు, ప్రజాప్రతినిధులు ఎన్టీఆర్ ఘాట్‌కు వచ్చారు. మహా నాయకుడికి ఘన నివాళి అర్పించారు. మంత్రులు మల్లారెడ్డి, పువ్వాడతోపాటు ఇతర ఎమ్మెల్యేలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈసందర్భంగా ఎన్టీఆర్ చేసిన సేవలను గుర్తు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఎన్టీఆర్ విగ్రహాలకు మంత్రులు, టీఆర్ఎస్ నేతలు పూలమాలలు వేసి నివాళులర్పించారు.
రాజకీయ వ్యూహాంలో భాగంగానే ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల్లో టీఆర్ఎస్ మంత్రులు, నేతలు పాల్గొన్నట్లు తెలుస్తోంది. గతంలో పీవీ నరసింహారావును సైతం ఆ పార్టీ ఓన్ చేసుకుంది. ఈక్రమంలోనే ఎన్టీఆర్ రాగాన్ని ఎత్తుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. తెలంగాణలో సీమాంధ్రుల సంఖ్య అధికంగా ఉంది. మరి ముఖ్యంగా జీహెచ్ఎంసీ పరిధిలో సెటిలర్లు అధికంగా ఉన్నారు. రాబోయే ఎన్నికలే టార్గెట్‌గా ఈవ్యూహాన్ని రచించినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.
ఇప్పటికే రెండుసార్లు టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చింది. ప్రజా వ్యతిరేక ఓట్లు చీలకుండా సీఎం కేసీఆర్ ఈ వ్యూహాన్ని రచించినట్లు ఆ పార్టీ నేతలే చర్చించుకుంటున్నారు. సీఎం కేసీఆర్..గతంలో టీడీపీలో ఉన్నారు. ఆ పార్టీ తరపున కీలక పదవుల్లో పనిచేశారు. ఆ తర్వాత జరిగిన పరిణామాలతో టీడీపీ వీడి ..సొంతంగా పార్టీని స్థాపించారు. తెలంగాణ సాధనే లక్ష్యంగా పనిచేశారు.
2014లో తెలంగాణ ఏర్పడిన ఆ తర్వాత టీడీపీ ..ఏపీకే పరిమితమైంది. తెలంగాణలో ఉన్న కీలక నేతలంతా టీఆర్ఎస్ గూటికి చేరారు. ఇప్పటికే ఆ పార్టీకి శ్రేణులు,కార్యకర్తలు భారీగా ఉన్నారు. ఎన్టీఆర్‌ను ఓన్ చేసుకోవడం ద్వారా వారికి మరింత దగ్గర కావాలని టీఆర్ఎస్ యోచిస్తోంది. రాబోయే ఎన్నికలే టార్గెట్ గా ముందుకు వెళ్తున్న ఆ పార్టీకి ఏ ఏ అంశాలు కలిసి వస్తాయో చూడాలి..
Also read:Aadhaar Update: 'ఆధార్'కు సంబంధించి ఆ ప్రకటనను ఉపసంహరించుకున్న కేంద్రం...
Also read: Nagababu Tour: ఏపీలో స్పీడ్ పెంచిన జనసేన..త్వరలో నాగబాబు ఉత్తరాంధ్ర టూర్..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook