Chandrababu Meeting with Telangana TDP Leaders: తెలంగాణలో టీడీపీ నేతలతో చంద్రబాబు భేటీ అయ్యారు. తెలంగాణలో ఏ ఇతర పార్టీలతోనూ పొత్తులు లేవని.. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ టీడీపీ ఒంటరిగానే పోటీ చేస్తుందని టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు తెలంగాణ నేతలకు చెప్పారు. సోమవారం హైదరాబాద్ లోని చంద్రబాబు నాయుడు నివాసంలో తెలంగాణ టిడిపి రాష్ట్ర అధ్యక్షులు కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్, పోలిట్ బ్యూరో సభ్యులు రావుల చంద్రశేఖర్ రెడ్డితో పాటు పలువురు ముఖ్య నేతలతో సమావేశం అయ్యారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు .. కాసాని నిర్వహించే బస్సు యాత్ర .. పోటీ చేసే అభ్యర్థులపై మరియు తెలంగాణలో రాజకీయ పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. పలు నియోజవర్గంలో పార్టీ పరిస్థితి లపై చేసిన కార్యక్రమాలపై చంద్రబాబు నాయుడుకు వివరించారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఏ పార్టీతో తెలంగాణలో  కలిసి పోటీ చేసే పరిస్థితి లేదని ఒంటరిగా చేయడానికే  సిద్ధపడాలన్నారు . తెలంగాణలో  అభివృద్ధి చేసింది తెలుగుదేశం అని ఏమి చేశామో ప్రజలకు క్రింది స్థాయి  వరకు తీసుకపోవాలన్నారు. రాష్ట్రంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేయడంతో హైదరాబాద్ అభివృద్ధి చెందిందని దేశంలో  మొట్టమొదటిసారిగా  ఔటర్ రింగ్ రోడ్ నిర్మాణానికి శ్రీకారం చుట్టామని తెలిపారు. 


విజన్ 2020 పెట్టి అభివృద్ధి చేశామని నేడు విజన్ 2047 తో  మందుకు సాగుతున్నామన్నారు. తెలంగాణలో తెలుగుదేశం పార్టీ ఉండడం చారిత్రాత్మ అవసరమని తెలంగాణలో పార్టీ గెలవాలన్నారు. రాష్ట్రంలో ఏ నియోజకవర్గంలో చూసిన తెలుగుదేశం పార్టీ చేసిన అభివృద్ధి కార్యక్రమాలు నేటికీ ప్రజలు గుర్తు చేసుకుంటున్నారు. మన పార్టీపై ఉన్న ప్రేమ అభిమానం తెలంగాణ నాయకులు ఉపయోగించుకోవాలన్నారు. త్వరలోనే అందరితో మాట్లాడి అభ్యర్థుల జాబితా ప్రకటించుటకు చర్యలు తీసుకుంటామన్నారు అభ్యర్థులను ప్రకటించిన తర్వాత బస్సు యాత్ర చేపట్టాలని నాయకులకు  సూచించారు. 


ఇది కూడా చదవండి : Mynampalli Hanmantha Rao: మైనంపల్లిపై కేసీఆర్ యాక్షన్ తీసుకుంటారా


ఈ సమావేశంలో తెలంగాణ టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్. పోలిట్ బ్యూరో సభ్యులు రావుల చంద్రశేఖర్ రెడ్డి.పార్టీ జాతీయ క్రమశిక్షణ సంఘం సభ్యులు బంటు వెంకటేశ్వర్లు. జాతీయ కార్యదర్శి కాసాని వీరేశం. అలి మస్కతి. సామ భూపాల్ రెడ్డి. జక్కలి ఐలయ్య యాదవ్. బండరు వెంకటేష్ తో పాటు పోటీ చేసే అభ్యర్థులు  తదితులు ఉన్నారు.


ఇది కూడా చదవండి : KTR and Kavitha: హన్మంత రావు పేరు ఎత్తకుండానే ఘాటుగా స్పందించిన కేటీఆర్, కవిత



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి