Chiranjeevi - Gaddar Awards: గద్దర్ అవార్డ్స్ పై తొలిసారి నోరు విప్పిన చిరంజీవి.. ? ఇంతకీ ఏమన్నారంటే.. ?
Chiranjeevi - Gaddar Awards: తెలుగు రాష్ట్రాలు రెండుగా విడిపోయిన తర్వాత ప్రభుత్వం ఇచ్చే నంది అవార్డులు నిలిచిపోయాయి. తాజాగా కాంగ్రెస్ నేతృత్వంలోని రేవంత్ రెడ్డి ప్రభుత్వం నంది అవార్డులు స్థానంలో గద్దర్ అవార్డులు ఇస్తానంటూ ప్రకటించారు. దీనిపై బిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. తాజాగా ఈ గద్దర్ అవార్డ్ పై చిరంజీవి స్పందించారు.
Chiranjeevi - Gaddar Awards: తాజాగా 2024 యేడాదిగాను కేంద్ర ప్రభుత్వం రిపబ్లిక్ డే సందర్భంగా పలువురు ప్రముఖులకు పద్మ అవార్డులను ప్రకటించిన సంగతి తెలిసిందే కదా. ఇందులో తెలుగు రాష్ట్రాల నుంచి వెంకయ్య నాయుడు, చిరంజీవి సహా పలువురు ప్రముఖులు ఉన్నారు. వారికి ఈ రోజు తెలంగాణ ప్రభుత్వం శిల్పాకళావేదికలో సన్మానించిన సంగతి తెలిసిందే కదా. ఈ సందర్బంగా పేద పద్మ అవార్డు కళాకారులకు రాష్ట్ర ప్రభుత్వం రూ. 25 లక్షల చెక్‌తో పాటు నెలకు రూ. 25 వేలు పెన్షన్ లైఫ్ లాంగ్ ఇస్తానంటూ ప్రకటించి సంచలనం రేపారు సీఎం రేవంత్ రెడ్డి.
ఇక పద్మ అవార్డు గ్రహీతల సన్మానం సందర్భంగా పద్మవిభూషణ్ అవార్డు గ్రహీత చిరంజీవి.. తాజాగా సీఎం రేవంత్ రెడ్డి నంది అవార్డుల స్థానంలో గద్దర్ అవార్డులు ఇస్తానంటూ చేసిన ప్రకటన పై ముందుగా సినీ ప్రముఖులు పెద్దగా స్పందించలేదు. కానీ ముందుగా సీనియర్ నటుడు మోహన్ బాబు సినిమా నటీనటులకు గద్దర్ అవార్డులు ఇవ్వడం సముచితమే అన్నారు. ఆయన పేరిట అవార్డు ఇవ్వడం అంటే ఆయన చేసిన కృషికి, త్యాగానికి నిదర్శనమన్నారు. కళాకారులకు అవార్డులు ఇస్తే ఎంతో సంతోషిస్తారు. తెలంగాణ ప్రభుత్వం ఇకనైనా గద్దర్ పేరిట ప్రతి యేటా అవార్డులు ఇస్తే అంతకంటూ ఆనందం మరొకటి ఉండదన్నారు.
గద్దర్ అవార్డులపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. మరొవైపు ఇంకొందరు సినిమాలకు అంతగా సంబంధం లేని మాజీ దళ సభ్యుడైన గద్దర్ పేరిట అవార్డు ఇవ్వడం పై విమర్శలు చేస్తున్నారు. కేవలం రేవంత్ రెడ్డి ఓటు బ్యాంకు రాజకీయాల కోసమే ఈ అవార్డు ప్రకటన చేసినట్టు కనబడుతుందని అందరు సోషల్ మీడియా వేదికగా ఏకి పారేస్తున్నారు. ఏది ఏమైనా సిని ప్రముఖులు ఒక్కోక్కరుగా గద్దర్ అవార్డులపై తమ సంసిద్దత వ్యక్తం చేస్తున్నారు.
తాజాగా మెగాస్టార్ చిరంజీవి కూడా తెలంగాణ ప్రభుత్వం చేసిన గద్దర్ అవార్డుల ప్రకటనపై హర్షం వ్యక్తం చేశారు. నంది అవార్డులకు ఆయన పేరు పెట్టడం సముచితమే అన్నారు. ఈ సందర్భంగా తనకు సన్మానం చేసిన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు ఆయన మంత్రి వర్గ సహచరులకు కృతజ్ఞతలు తెలిపారు. మరోవైపు వెంకయ్య నాయుడు నిజమైన రాజ నీతిజ్ఞుడు అంటూ కొనియాడారు. వాజ్‌పేయ్ తర్వాత అంతటి హుందాతనం వెంకయ్య గారిలో ఉందన్నారు. ఇక వెంకయ్య నాయుడు వాగ్దాటికి తను పెద్ద ఫ్యాన్ అన్నారు. మరోవైపు తనతో పాటు పద్మ అవార్డులు అందుకోబోతున్న వారికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసారు.
ఇదీ చదవండి: Bharata Ratna: భారతరత్న ప్రదానం చేయడానికి ప్రమాణాలు ఏమిటి? అవార్డు గ్రహీతలు ఎలాంటి సౌకర్యాలు పొందుతారు?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook