Christmas Holidays 2023: తెలంగాణలోని స్కూళ్లకు రేపటి నుంచి వరుసగా మూడు రోజులపాటు సెలవులు రానున్నాయి. ఈ ఏడాది క్రిస్మస్(Christmas) డిసెంబరు 25న సోమవారం వచ్చింది. క్రిస్మస్ ముందు రోజు ఆదివారం, తర్వాత రోజు మంగళవారం బాక్సింగ్ డే ఉండటంతో వరుసగా మూడు రోజుల హాలిడేస్ వచ్చినట్లయింది. క్యాలెండర్ లో సోమవారం, మంగళవారం సెలవులు ఉండటంతో స్కూళ్లతోపాటు ప్రభుత్వ కార్యాలయాలు మూతపడనున్నాయి. అయితే ఏపీలో మాత్రం 25న మాత్రమే సెలవు ఉంది, 26న హాలిడే ఇవ్వలేదు. ఈ ఏడాది సెలవులు ఎక్కువనే చెప్పాలి. పండగ సెలవులతో పాటు వర్షాలు అధికంగా పడటం, బంద్ తదితర కారణాల వల్ల విద్యాసంస్థలకు వరుసగా సెలవులు వచ్చాయి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇటీవల తెలంగాణ ప్రభుత్వం 2024 సంవత్సరానికి సంబంధించిన సెలవులను(Telangana Govt Holidays 2024) ప్రకటించింది. పండుగలు, జాతీయ సెలవులు కలిసి మొత్తంగా 27 సాధారణ సెలవులు, 25 ఆప్షనల్ సెలవులను ప్రకటించింది. అయితే న్యూ ఇయర్ సెలవుకు ఇస్తున్న నేపథ్యంలో దానికి బదులుగా  ఫిబ్రవరి 10న ప్రభుత్వ కార్యాలయాలు పనిచేస్తాయని సీఎస్ ఉత్తర్వుల్లో పేర్కొన్న సంగతి తెలిసిందే. క్రిస్మస్ తర్వాత వచ్చే పండుగలలో భోగి, సంక్రాంతి ముఖ్యమైనవి. ఈ నేపథ్యంలో పొంగల్ కు వరుసగా ఆరు రోజులు సెలవులు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 


సాధారణ సెలవులు-2024 
నూతన సంవత్సరం - 01-01-2024 (సోమవారం)
భోగి -14-01-2024(ఆదివారం)
సంక్రాంతి / పొంగల్ -15-01-2024 (సోమవారం)
రిపబ్లిక్ డే- 26-01-2024 (శుక్రవారం)
మహా శివరాత్రి-08-03-2024 (శుక్రవారం)
హోలీ -25-03-2024((సోమవారం)
శుభ శుక్రవారం-29-03-2023 (శుక్రవారం)
బాబు జగ్జీవన్ రామ్ పుట్టినరోజు -05-04-2024 (శుక్రవారం)
ఉగాది -09-04-2024(మంగళవారం)
రంజాన్ -11-04-2023 (గురువారం)
రంజాన్ -12-04-2023 (శుక్రవారం)
అంబేడ్కర్ జయంతి- 14-04-2024 (ఆదివారం)
శ్రీరామ నవమి -17-04-2024 (బుధవారం)
ఈదుల్ అజా (బక్రీద్)- 17-06-2024 (సోమవారం)
మొహరం-17-07-2024(బుధవారం)
బోనాలు-29-07-2024(సోమవారం)
స్వాతంత్ర్య దినోత్సవం- 15-08-2024(గురువారం)
కృష్ణాష్టమి-26-08-2024(సోమవారం)
వినాయక చవితి- 07-09-2024 (శనివారం)
ఈద్ మిలాదున్ నబీ-16-09-2024(సోమవారం)
మహాత్మా గాంధీ జయంతి / బతుకమ్మ ప్రారంభ రోజు- 02-10-2024 (బుధవారం)
విజయ దశమి-12-10-2024(శనివారం)
తరువాతి రోజు విజయ దశమి- 13-10-2024 (ఆదివారం)
దీపావళి- 31-10-2024(గురువారం)
కార్తీక పూర్ణిమ /గురునానక్ పుట్టినరోజు- 15-11-2024 (శుక్రవారం)
క్రిస్మస్ -25-12-2024(బుధవారం)
బాక్సింగ్ డే- 26-12-2024(గురువారం)


Also read: Discounts on traffic Challans: వాహనదారులకు గుడ్ న్యూస్.. పెండింగ్ చలాన్లపై భారీ డిస్కౌంట్..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook