Rape incident in Rajendranagar: హైదరాబాద్ (Hyderabad) శివారులోని రాజేంద్రనగర్‌లో దారుణం జరిగింది. పదో తరగతి బాలిక (16)పై ఓ యువకుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఇంట్లో బాలిక ఒంటరిగా ఉన్న విషయాన్ని గమనించి మాయ మాటలతో ఆమెను ట్రాప్ చేశాడు. బైక్‌పై ఆమెను హిమాయత్ సాగర్ వైపు తీసుకెళ్లి... అక్కడి చెట్ల పొదల్లోకి లాక్కెళ్లి అత్యాచారానికి (Rajendranagar Rape Incident) ఒడిగట్టాడు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అత్యాచార విషయం బయటకు పొక్కితే నిన్ను, నీ కుటుంబ సభ్యులను చంపేస్తానని నిందితుడు బాలికను బెదిరించాడు. అత్యాచారం తర్వాత ఆమెను బైక్‌పై ఇంటి వద్ద దిగబెట్టాడు. నిందితుడి బెదిరింపులతో భయపడిపోయిన బాధిత బాలిక... జరిగిన ఘటనపై తనలో తానే కుమిలిపోయింది. ఇటీవల ఎట్టకేలకు విషయాన్ని తన తల్లితో చెప్పగా... కుమార్తెను వెంటపెట్టుకుని ఆమె రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు ఆ యువకుడిపై అత్యాచార కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. 


నిందితుడితో బాధిత బాలికకు పరిచయం ఉందని... ఇద్దరి మధ్య ఏడాది కాలంగా స్నేహం కొనసాగుతోందని పోలీసులు (Hyderabad Police) వెల్లడించారు. నిందితుడు బాలిక (Crime against Women) ఇంటికి సమీపంలోనే ఉంటాడని గుర్తించామన్నారు. త్వరలోనే నిందితుడిని అరెస్ట్ చేసి అతనికి కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామన్నారు. 


Also Read: Kalicharan Maharaj: గాంధీని చంపిన గాడ్సేకి నమస్కరిస్తున్నా.. ఆధ్యాత్మిక గురువు అనుచిత వ్యాఖ్యలు, అరెస్ట్


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook