Class 3 Girls Tried to Flee: హైదరాబాద్‌లో ఇద్దరు మూడో తరగతి బాలికలు స్కూల్ ముగిసిన అనంతరం పారిపోయేందుకు యత్నించారు. బాలికల ఆచూకీ తెలియకపోవడంతో వారి కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు. స్కూల్ పరిసర ప్రాంతాల్లో వెతికినప్పటికీ లాభం లేకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు రంగంలోకి దిగి ఎట్టకేలకు ఆ ఇద్దరు బాలికల ఆచూకీ తెలుసుకుని.. వారి తల్లిదండ్రులకు అప్పగించారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం... వనస్థలిపురంలోని క్రాంతి హిల్స్ కాలనీకి చెందిన 9, 10 ఏళ్ల వయసున్న ఇద్దరు బాలికలు స్థానికంగా ఉన్న ఓ ప్రైవేట్ స్కూల్లో మూడో తరగతి చదువుతున్నారు. ఎప్పటిలాగే ఇటీవల ఓరోజు స్కూల్‌కు వెళ్లిన బాలికలు... స్కూల్ ముగిసిన తర్వాత కనిపించకుండా పోయారు.


ఆ ఇద్దరు బాలికల్లో ఒక బాలిక సోదరుడు, మరో బాలిక తండ్రి ప్రతీ రోజూ స్కూల్ ముగిశాక వారిని ఇంటికి తీసుకెళ్తారు. ఇదే క్రమంలో ఆరోజు కూడా స్కూల్ ముగిసే సమయానికి అక్కడికి వెళ్లారు. స్కూల్ గేటు బయట వారి కోసం ఎదురుచూశారు. అయితే ఎంతసేపటికీ వారు బయటకు రాకపోవడంతో.. స్కూల్ లోపలికి వెళ్లి సిబ్బందిని అడిగారు. ఆ ఇద్దరూ అప్పటికే వెళ్లిపోయారని చెప్పడంతో షాక్ తిన్నారు.


స్కూల్ బయట ఉన్న సీసీ కెమెరాలను పరిశీలించగా ఆ ఇద్దరు బాలికలు ఓవైపు నడుచుకుంటూ వెళ్లడం గమనించారు. అయితే ఆ తోవలో వెతికినప్పటికీ వారి ఆచూకీ దొరకలేదు. దీంతో వనస్థలిపురం పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు ఆ బాలికల స్నేహితుడిని విచారించగా విస్తుపోయే విషయం చెప్పాడు. గత 3 రోజులుగా ఆ ఇద్దరు పారిపోయేందుకు ప్లాన్ చేస్తున్నారని తెలిపాడు. అంతేకాదు, సుష్మా థియేటర్ రోడ్డు వైపు వెళ్తున్నట్లు తనతో చెప్పారన్నాడు. దీంతో పోలీసులు మూడు గంటల పాటు వెతకగా... చివరకు ఓ బస్టాప్‌లో ఇద్దరు కనిపించారు. 


అనంతరం ఆ ఇద్దరినీ స్కూల్‌కు తీసుకొచ్చి విచారించగా అసలు కారణం వెల్లడించారు. ఇటీవల హిందీ పరీక్ష సరిగా రాయలేదని... సరైన మార్క్స్ రాకపోతే తల్లిదండ్రులు తమను హాస్టల్లో చేరుస్తారనే భయంతో పారిపోవాలనుకున్నామని చెప్పారు. ఆ ఇద్దరు విద్యార్థుల తల్లిదండ్రులను పిలిపించిన పోలీసులు వారిని అప్పగించారు. 


Also Read: Pawan Kalyan News: అనంతపురంలో 'కౌలు రైతు భరోసా యాత్ర'.. రైతు కుటుంబాలను పవన్ ఆర్థిక సాయం!


Also Read: Rajbhavn Vs Pragathi bhavan: గవర్నర్ తమిళిసై.. సీఎం కేసీఆర్‌.. అసలేం జరిగింది..? జీ తెలుగు న్యూస్ స్పెషల్ స్టోరీ


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook