headmaster hugging girl in school: కర్ణాటక మైసూరులోని (Mysuru Private School) ఓ ప్రైవేట్ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు...విద్యార్థిని పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో (Social Media) వైరల్ గా మారింది. దీంతో హెడ్ మాస్టర్ (Head Master) పై సస్పెన్షన్ వేటు వేయటంతోపాటు కేసు నమోదు చేశారు.
అసలేం జరిగిందంటే...
పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఆర్.ఎం.అనిల్‌కుమార్.. విద్యార్థినిని తన ఛాంబర్లోకి తీసుకెళ్లి కౌగిలించుకున్నాడు. మిగిలిన విద్యార్థులు కిటికీలోంచి వీడియో తీశారు. ఆ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. ఈ ఘటనపై రాష్ట్రవ్యాప్తంగా అగ్రహం వ్యక్తమవుతోంది. ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్న విద్యాశాఖ.. బ్లాక్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ (బీఈవో) ఎం. చంద్రకాంత్ ఆధ్వర్యంలో విచారణ చేపట్టింది. అతడిపై సస్పెన్షన్ వేటు వేసింది.
ఈ ఘటనపై సర్వత్రా నిరసన వ్యక్తమవుతోంది. ఉపాధ్యాయుడి ప్రవర్తన మొత్తం విద్యాశాఖకే మచ్చగా చంద్రకాంత్ పేర్కొన్నారు. బీఈవో ఇచ్చిన ఫిర్యాదు మేరకు కుమార్‌పై పోక్సో చట్టం (POCSO Act) కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
Also read: Monkey love video: తల్లి ప్రేమ అంటే అంతే మరి.. మనుషులలైనా.. జంతువులైన!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook