Bhatti Vikramarka: కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎపిసోడ్‌పై సీఎల్పీ నేత భట్టి విక్రమార్క స్పందించారు. ఆయన కాంగ్రెస్‌లోనే ఉంటారని స్పష్టం చేశారు. రాజగోపాల్‌రెడ్డితో తాను, పార్టీ అధిష్టానం మాట్లాడామని గుర్తు చేశారు. పార్టీలో ఆయన సమస్యను పార్టీ పెద్దలు తెలుసుకున్నారని చెప్పారు. ఈ విషయంలో ప్లాన్ ఏ విఫలమైతే ప్లాన్ బీ అమలు చేస్తామన్నారు.  కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ..పార్టీకి విధేయుడని తెలిపారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఆయన పార్టీ నుంచి వెళ్లకుండా చూడటమే తమ లక్ష్యమన్నారు. ఇందుకు సంప్రదింపులు జరుగుతూనే ఉన్నాయన్నారు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క. మరోవైపు తెలంగాణ ప్రభుత్వంపై ఆయన మరోసారి మండిపడ్డారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలను టీఆర్ఎస్‌ నెరవేర్చలేదన్నారు. 8 ఏళ్ల పాలనలో ఉన్న ఆదాయాన్ని , సంపదను కాళేశ్వరంలోనే దారపోశారని మండిపడ్డారు. ఇటీవల వరదలకు గోదావరి పరివాహక ప్రాంత ప్రజలు సర్వం కోల్పోయారని చెప్పారు.


వారిని ప్రభుత్వమే ఆదుకోవాలని భట్టి విక్రమార్క డిమాండ్ చేశారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ వల్ల ఒక్క ఎకరానికి కూడా సాగు నీరు అందలేదని విమర్శించారు. త్వరలోనే తామంతా కాళేశ్వరం ప్రాజెక్ట్‌కు వెళ్తామని..అక్కడి పరిస్థితిని తెలుసుకుంటామని స్పష్టం చేశారు. తమను అడ్డుకుంటే తీవ్ర పరిణామాలు ఉంటాయన్నారు. వరదల గురించి మంత్రుల నుంచి ఎలాంటి స్పందన లేదని..కేటీఆర్ మాత్రం ఇంటి నుంచే రివ్యూలు చేస్తున్నారని విమర్శించారు. 


తక్షణమే కాళేశ్వరం పూర్తి వివరాలను బయట పెట్టాలన్నారు. భారీ వర్షాలతో ప్రజలు ఇబ్బందులు పడుతుంటే సీఎం కేసీఆర్ ఢిల్లీ పర్యటన ఎందుకని ఫైర్ అయ్యారు. సొంత రాజకీయ ప్రయోజనాల కోసమే రాష్ట్రాన్ని టీఆర్ఎస్ తాకట్టు పెడుతోందన్నారు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క. మరోవైపు ఢిల్లీకి రావాలని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని కాంగ్రెస్ అధిష్టానం పిలుపునిచ్చింది. ప్రస్తుతం తాను నియోజకవర్గంలో పర్యటిస్తున్నానని..త్వరలో వస్తానని ఢిల్లీ పెద్దలకు సమాచారం అందించారు. 


Also read:CWG 2022: కామన్వెల్త్ గేమ్స్‌లో భారత్‌ బోణీ..వెయిట్ లిఫ్టింగ్‌లో తొలి పంచ్..!


Also read:Bandi Sanjay: మునుగోడులో ఉప ఎన్నిక తప్పదా..బండి సంజయ్ ఏమన్నారంటే..!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి. Twitter , Facebook