Bandi Sanjay: మునుగోడులో ఉప ఎన్నిక తప్పదా..బండి సంజయ్ ఏమన్నారంటే..!

Bandi Sanjay: తెలంగాణలో రాజకీయ వేడి హీట్ పుట్టిస్తోంది. మునుగోడు చుట్టే రాజకీయం తిరుగుతోంది. ఈక్రమంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

Written by - Alla Swamy | Last Updated : Jul 30, 2022, 06:24 PM IST
  • తెలంగాణలో రాజకీయ వేడి
  • మునుగోడు చుట్టే పాలిటిక్స్
  • తాజాగా బండి సంజయ్‌ హాట్ కామెంట్స్
Bandi Sanjay: మునుగోడులో ఉప ఎన్నిక తప్పదా..బండి సంజయ్ ఏమన్నారంటే..!

Bandi Sanjay: మునుగోడు రాజకీయాలపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ హాట్ కామెంట్స్ చేశారు. మునుగోడులో ఉప ఎన్నిక రావాలని టీఆర్ఎస్‌ కోరుకుంటోందన్నారు. అదే సమయంలో రావొద్దని కాంగ్రెస్‌ కోరుకుంటోందని తెలిపారు. తాము ప్రజల తరపున ఉంటామని స్పష్టం చేశారు. పాతబస్తీలో ఈసారి బీజేపీ పాగా వేస్తుందని ధీమా వ్యక్తం చేశారు. వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్‌కు 15 సీట్లు కూడా రావని జోస్యం చెప్పారు. పార్టీ అభ్యర్థులకు అధిష్టానమే నిర్ణయిస్తుందని..ఇందులో ఎవరి జోక్యం ఉండదన్నారు. 

గత కొంతకాలంగా మునుగోడు చూట్టే తెలంగాణ రాజకీయం తిరుగుతోంది. ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి పార్టీ మారుతారని ప్రచారం జరుగుతోంది. ఆయన ప్రస్తుతం కాంగ్రెస్‌ పార్టీలో ఉన్నారు. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి..బీజేపీలోకి చేరుతారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇందులో భాగంగానే ఇటీవల కేంద్రమంత్రి, బీజేపీ సీనియర్ నేత అమిత్ షాతో ఆయన భేటీ అయ్యారు. అప్పుడే పార్టీ చేరికపై క్లారిటీ వచ్చినట్లు ప్రచారం జరుగుతోంది.

ఇటీవల ఆయన చేసిన వ్యాఖ్యలు ఇందుకు ఊతమిస్తోంది. కేసీఆర్‌ను ఓడించే సత్తా బీజేపీకే ఉందన్నారు. అదే సమయంలో కాంగ్రెస్‌ తీరుపై విమర్శలు చేశారు. తెలంగాణలో ఆ పార్టీ దిగజారిపోయిందన్నారు. జైలు నుంచి వచ్చిన వారికి పార్టీ అధ్యక్షుడి పదవి ఇచ్చారని మండిపడ్డారు. ఆ వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. మునుగోడు ఉప ఎన్నిక రావాలని టీఆర్ఎస్‌ కోరుకుంటుందోని ఫైర్ అయ్యారు.

అప్పటి నుంచి తెలంగాణలో టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఈక్రమంలో ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ఇవాళ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. త్వరలో కేసీఆర్ కుటుంబంపై యుద్ధం ప్రకటిస్తానని వ్యాఖ్యనిచ్చారు. తాను ప్రకటించే యుద్ధం రాజకీయ పార్టీల మధ్య కాదని..కేసీఆర్ కుటుంబానికి, తెలంగాణ ప్రజల మధ్య అని స్పష్టం చేశారు. తెలంగాణలో ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటే మునుగోడు నియోజకవర్గ ప్రజల తీర్పు కీలక అని అన్నారు. దీంతో ఉప ఎన్నిక తధ్యమని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

Also read:Tollywood: టాలీవుడ్ నిర్మాతల్లో ముసలం.. షూటింగ్స్ ఆపేది లేదు.. గిల్డ్ కు షాక్

Also read:CWG 2022: కామన్వెల్త్ గేమ్స్‌లో భారత్‌ బోణీ..వెయిట్ లిఫ్టింగ్‌లో తొలి పంచ్..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి. Twitter , Facebook

Trending News