CM KCR announce trs party support to bharat bandh: హైద‌రాబాద్: కేంద్ర ప్రభుత్వం అమలు చేసిన కొత్త వ్యవసాయ చట్టాలకు ( Farm Bills ) వ్యతిరేకంగా ఢిల్లీ సరిహద్దుల్లో (Delhi Chalo protest) రైతులు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే. కేంద్ర ప్రభుత్వం తీరుకు నిరసనగా రైతు సంఘాలు ఈ నెల 8న భారత్ బంద్‌ ( Bharat Bandh ) కు పిలుపునిచ్చాయి. ఈ క్రమంలో తెలంగాణ (Telangana) ముఖ్యమంత్రి కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. రైతులు తలపెట్టిన భారత్ బంద్‌కు టీఆర్ఎస్ పార్టీ సంపూర్ణ మద్దతు ఇస్తుందని ఆ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు ( CM KCR ) ఆదివారం ప్రకటించారు. టీఆర్ఎస్ ( TRS ) కార్యకర్తలందరూ బంద్‌లో ప్రత్యక్షంగా పాల్గొంటారని సీఎం వెల్లడించారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


Also Read | భారత్‌లో త్వరలో Pfizer Covid-19 Vaccine కానీ.. 


కేంద్రం తెచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు న్యాయ‌మైన పోరాటాన్ని చేస్తున్నారని ఈ సందర్భంగా కేసీఆర్ పేర్కొన్నారు. రైతుల ప్రయోజనాలను దెబ్బతీసే విధంగా ఉన్నందునే పార్లమెంటులో వ్యవసాయ బిల్లులను టీఆర్ఎస్ పార్టీ వ్యతిరేకించిందని కేసీఆర్ గుర్తుచేశారు. కొత్త చట్టాలను ఉపసంహరించుకునే వరకు పోరాటం కొనసాగించాల్సిన అవసరం ఉందని కేసీఆర్ అభిప్రాయపడ్డారు. మంగళవారం జరిగే బంద్‌ను విజయవంతం చేసి రైతులకు అండగా నిలవాలని సీఎం కేసీఆర్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. భారత్ బంద్ విజయవంతానికి టీఆర్ఎస్ కృషి చేస్తుందని సీఎం కేసీఆర్ వెల్లడించారు. Also read: Farmer protests: చర్చలు మళ్లీ విఫలం.. 9న మరోసారి భేటీ


ఇదిలాఉంటే.. ఈ నెల 8వ తేదీన జరిగే భారత్‌ బంద్‌కు పది ప్రధాన కార్మిక సంఘాలు సైతం తమ మద్దతును ప్రకటించాయి. ఈ మేరకు ఐఎన్‌టీయూసీ, ఏఐటీయూసీ, సీఐటీయూ, బీఎంఎస్‌, ఏఐయూటీయూసీ, టీయూసీసీ, ఎస్‌ఈడబ్లుఏ, ఏఐసీసీటీయూ, ఎల్‌పీఎఫ్‌, యూటీయూ సంఘాలు రైతులకు మద్దతుగా భారత్ బంద్‌లో పాల్గొనన్నట్లు శనివారం వెల్లడించాయి.  


Also Read| Tejashwi Yadav: ఆర్జేడీ నేత తేజస్వీతోపాటు 518 మందిపై కేసు


Also read | Rashmika Mandanna: కాటుక కళ్లతో కవ్విస్తున్న రష్మిక..



Also Read | 2021 జనవరి నుంచి క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు రూల్స్‌లో మార్పు, పూర్తి వివరాలు చదవండి!


 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


సోషల్ మీడియాలో జీ హిందుస్థాన్ పేజీలను సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook