Rythu Bandhu second phase distribution: హైదరాబాద్: రెండో విడత రైతుబంధు సాయం ప్రతీఒక్క రైతుకు అందాలని తెలంగాణ ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్‌ రావు ( CM KCR ) అధికారులను ఆదేశించారు. ఈ నెల 27వ తేదీ నుంచి వచ్చేనెల 7వ తేదీవరకు రైతుబంధు ( Rythu Bandhu Scheme) రెండో విడత ఆర్ధిక సాయాన్ని అందించనున్నట్లు సీఎం కేసీఆర్ వెల్లడించారు. రెండో విడత రైతుబంధు పంపిణీ, అనుసరించాల్సిన విధానాలపై ముఖ్య‌మంత్రి కేసీఆర్ ప్ర‌గ‌తి భ‌వ‌న్‌లో సోమవారం అధికారుల‌తో స‌మీక్ష నిర్వ‌హించారు. ఈ సమావేశంలో వ్య‌వ‌సాయ శాఖ మంత్రి నిరంజ‌న్ రెడ్డి, సీఎస్ సోమేశ్ కుమార్‌, ఆర్థిక శాఖ‌, వ్య‌వ‌సాయ శాఖ ముఖ్య కార్య‌ద‌ర్శులు, పలువురు అధికారులు హాజ‌ర‌య్యారు. Also read: Benefits of Egg: రోజూ ‘గుడ్డు’ తింటే ఎన్ని లాభాలో తెలుసా?


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ.. ఈ నెల 27వ తేదీ నుంచి జనవరి 7వ తేదీ వరకు రైతులకు రైతుబంధు సాయం పంపిణీ చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులను ఆదేశించారు. రాష్ట్రం ( Telangana ) లోని ప్రతి ఒక్క రైతుకు (farmers) సాయాన్ని అందించాలని అధికారులను ఆదేశించారు. రైతుల ఖాతాలోనే నేరుగా డబ్బులను జమ చేయాలని సూచించారు. దీనికోసం అవసరమైన రూ.7,300 కోట్లను విడుదల చేయాలని ఆర్థిక శాఖ అధికారులను ఆదేశించారు. చిన్న, సన్నకారుల నుంచి రైతులందరికీ కేవలం పది రోజుల వ్యవధిలో డబ్బులు జమ చేయాలని సూచించారు. 


Also read: Shraddha Das: ఫొటోలతో హీటెక్కిస్తున్న శ్రద్ధా దాస్


 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


సోషల్ మీడియాలో జీ హిందుస్థాన్ పేజీలను సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook