తెలుగు సినీ పరిశ్రమను కాపాడుకుంటామని..దీనికి కావల్సిన అన్ని చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. కోవిడ్ కారణంగా నష్టపోయిన పరిశ్రమకు రాయితీలు కల్పించనున్నామని చెప్పారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


తెలుగు సినీ పరిశ్రమ ( Telugu movie industry ) కు చెందిన ప్రముఖులు  కొందరు ప్రగతి భవన్ ( Pragati Bhavan ) లో ముఖ్యమంత్రి కేసీఆర్ తో సమావేశమయ్యారు. కోవిడ్ ( Covid19 virus ) కారణంగా పరిశ్రమలోని వివిధ విభాగాలకు వాటిల్లిన నష్టాన్ని వివరించారు. ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై సానుకూలంగా స్పందించిన ముఖ్యమంత్రి కేసీఆర్ ( Cm KCR )..తెలుగు సినీ పరిశ్రమను కాపాడటానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామన్నారు. కరోనా వైరస్ కారణంగా  షూటింగులు నిలిచిపోయి..థియేటర్లు మూతపడి..పరిశ్రమకు , కార్మికులకు నష్టం వాటిల్లింది. ఈ నష్టం నుంచి కోలుకోడానికి మినహాయింపులు, రాయితీలు కల్పిస్తామని కేసీఆర్ హామీ ఇచ్చారు. రాష్ట్రానికి పరిశ్రమలు తరలి రావడానికి ప్రభుత్వం ఎన్నో చర్యలు తీసుకుంటున్నది. అలాంటిది ఉన్న పరిశ్రమను కాపాడుకోకపోతే ఎలా? అని అన్నారు. దేశంలో ముంబాయి, చెన్నైతో పాటు హైదరాబాద్ లోనే పెద్ద సినీ పరిశ్రమ ఉంది. లక్షలాది మందికి ఈ పరిశ్రమ ద్వారా ఉపాధి దొరుకుతుంది. 


ఈ పరిస్థితుల్లో పరిశ్రమను కాపాడుకోవల్సిన బాధ్యత అందరిపై ఉందని కేసీఆర్ చెప్పారు. అటు ప్రభుత్వం, ఇటు సినీ పరిశ్రమ పెద్దలు కలిసికట్టుగా ప్రయత్నాలు చేయాలన్నారు. ప్రభుత్వపరంగా అన్ని చర్యలు తీసుకుంటామన్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల ( GHMC Elections ) సందర్బంగా టీఆర్ఎస్ పార్టీ మేనిఫెస్టోలో సినిమా పరిశ్రమకు చెందిన అంశాల్ని ప్రస్తావించామన్నారు. Also read: AP: మరో అల్ప పీడనం, దక్షిణ కోస్తాంధ్రకు భారీ వర్ష సూచన