CM Kcr: దేశాన్ని విచ్ఛిన్నం చేసేందుకు కుట్ర..మౌనం వహించొద్దన్న సీఎం కేసీఆర్..!
CM Kcr: తెలంగాణలో స్వతంత్ర భారత వజ్రోత్సవాల ముగింపు ఘనంగా జరిగింది. ఎల్బీ స్టేడియంలో జరిగిన వేడుకల్లో సీఎం కేసీఆర్ పాల్గొని జాతీయ జెండా ఎగురవేశారు.
CM Kcr: ఇప్పటికీ దేశంలో పేదల ఆశలు నెరవేరడం లేదన్నారు సీఎం కేసీఆర్. పేద బడుగు వర్గాలకు స్వాతంత్ర్య ఫలాలు అందడం లేదని తెలిపారు. వీటి గురించి ఆలోచించకుండా దేశాన్ని ఉన్మాద స్థితిలోకి నెట్టేందుకు కుట్రలు జరుగుతున్నాయని విమర్శించారు. చూస్తూ మౌనం వహించడం సరైనది కాదన్నారు. ఏ సమాజమయితే సక్రమమైన మార్గంలో నడిపిస్తామో..ఆ సమాజం గొప్పగా ఉంటుందన్నారు సీఎం కేసీఆర్.
ఎంతో మంది త్యాగ ఫలితంగానే స్వాతంత్ర్యం సిద్ధించిందని స్పష్టం చేశారు. పేద, ధనిక అనే తేడా లేకుండా అందరూ కలిసి ముందుకు వెళ్లాలన్నారు. తెలంగాణలో స్వతంత్ర భారత వజ్రోత్సవాలు ఘనంగా జరిగాయన్నారు. ప్రతి ఇంట్లో స్ఫూర్తి రగిలేలా రోజుకో కార్యక్రమం చేపట్టామన్నారు సీఎం కేసీఆర్. కోటి మందితో సామూహిత జాతీయ గీతాలాపన చేశామని గుర్తు చేశారు. గాంధీజీ సేవలు అందర్నీ తెలియాలన్నారు. అహింసా మార్గం ద్వారా ఎంతటి శక్తిమంతులనైనా జయించవచ్చని ప్రపంచానికి సాటి చెప్పి దేశం మనది అని అన్నారు.
అలాంటి దేశంలో స్వాతంత్ర్య సమరయోధుల గురించి భవిష్యత్ తరాలకు తెలియాల్సి ఉందని స్పష్టం చేశారు. ఎన్నో త్యాగాలు, బలిదానాలు జరిగితేనే స్వాతంత్ర్యం వచ్చిందన్నారు. వాటిని మనం ఎప్పుడూ గుర్తించుకోవాలని తెలిపారు సీఎం కేసీఆర్. ఎన్ని విపత్కర పరిస్థితులు వచ్చినా ఎదుర్కోని ముందుకు వెళ్లాలన్నారు. హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో స్వతంత్ర భారత వజ్రోత్సవాల ముగింపు వేడుకలు ఘనంగా జరిగాయి. ముగింపు ఉత్సవాల్లో సీఎం కేసీఆర్, మంత్రులు పాల్గొన్నారు.
ఎల్బీ స్టేడియానికి చేరుకున్న సీఎం.. మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం జాతీయ జెండాను ఆవిష్కరించారు. గత కొన్నిరోజులుగా స్వతంత్ర భారత వజ్రోత్సవాలను తెలంగాణ ప్రభుత్వం ఘనంగా నిర్వహిస్తోంది. ఈసందర్భంగా రోజుకో కార్యక్రమం చేపట్టింది. ప్రభుత్వ ఆధ్వర్యంలో జరిగిన జాతీయ గీతాలాపన చరిత్రలో నిలిచిపోనుంది. మరోవైపు దేశవ్యాప్తంగా 75వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు వైభవంగా జరిగాయి. ప్రతి ఇంటిపై జాతీయ జెండా రెపరెపలాడింది. అదే స్ఫూర్తితో ముందుకు వెళ్లాలని ప్రధాని మోదీ, సీఎం కేసీఆర్ ఇప్పటికే పిలుపునిచ్చారు.
Also read:AP 10th Class: ఏపీలో చదువుల విప్లవం..10వ తరగతి పరీక్షా విధానంలో మరో కీలక మార్పు..!
Also read:Venkat Reddy: కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి పార్టీ మారుతున్నారా..సోనియా గాంధీకి ఘాటు లేఖ..!
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి