CM KCR Birthday: సీఎం కేసీఆర్‌కు ప్రధాని నరేంద్ర మోదీ బర్త్ డే విషెస్..
PM Narendra Modi Birthday Wishes to CM KCR: ఇవాళ తెలంగాణ సీఎం కేసీఆర్ పుట్టినరోజు. గులాబీ శ్రేణులు ఆయన పుట్టినరోజును ఘనంగా నిర్వహించేలా ఏర్పాట్లు చేశారు. ఈసారి కేసీఆర్ జన్మదిన వేడుకలను మూడు రోజుల పాటు నిర్వహిస్తుండటం విశేషం.
PM Narendra Modi Birthday Wishes to CM KCR: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ప్రధాని నరేంద్ర మోదీ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. సీఎం కేసీఆర్ ఆయురారోగ్యాలతో ఉండాలని ప్రార్థిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ మేరకు ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. కేంద్రంపై సీఎం కేసీఆర్ యుద్ధం ప్రకటించిన వేళ స్వయంగా ప్రధాని మోదీ కేసీఆర్‌కు విషెస్ చెప్పడం చర్చనీయాంశంగా మారింది. శత్రువుకైనా పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పే గొప్ప మనసున్న నేత మోదీ అంటూ ఆయన మద్దతుదారులు ట్విట్టర్‌లో కామెంట్స్ చేస్తున్నారు.
ఇవాళ సీఎం కేసీఆర్ 68వ వసంతంలోకి అడుగుపెడుతున్నారు. మునుపటి కంటే ఈసారి కేసీఆర్ పుట్టినరోజు వేడుకలు మరింత ప్రాధాన్యం సంతరించుకున్నాయి. కేసీఆర్ జాతీయ రాజకీయాల వైపు చూస్తున్న వేళ.. ఆయన పుట్టినరోజును ఘనంగా నిర్వహించేందుకు పార్టీ వర్గాలు ప్లాన్ చేశాయి. ఈ నెల 15వ తేదీ నుంచి మూడు రోజుల పాటు పుట్టినరోజు వేడుకలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో రక్తదాన శిబిరాలు, సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు.
కాగా, ఉద్యమ నేతగా, ముఖ్యమంత్రిగా కేసీఆర్ తెలంగాణపై తనదైన ముద్ర వేశారు. బంగారు తెలంగాణ స్వాప్నికుడిగా ముందుకు సాగుతున్న ఆయన ఫోకస్ ఇప్పుడు జాతీయ రాజకీయాలపై పడింది. నిజానికి గత సార్వత్రిక ఎన్నికల సమయంలోనే ఆయన ఫెడరల్ ఫ్రంట్ కోసం ప్రయత్నించి జాతీయ రాజకీయాల్లో కీలకంగా వ్యవహరించాలని భావించారు. కానీ ఆ ప్రయత్నాలు అప్పట్లో సఫలం కాలేదు. తాజాగా మరోసారి ఆయన చూపు జాతీయ రాజకీయాల వైపు మళ్లింది.
కొద్దిరోజులుగా బహిరంగ సభలు, ప్రెస్ మీట్లలో కేసీఆర్ కేంద్రాన్ని, ప్రధాని నరేంద్ర మోదీని గట్టిగా టార్గెట్ చేస్తూ వస్తున్నారు. ఢిల్లీ కోటలు బద్దలు కొడుతామని.. మోదీని తరిమేస్తామని గంభీరమైన ప్రకటనలు చేశారు. కొత్త రాజ్యాంగం కావాలంటూ సంచలన చర్చకు తెరలేపారు. బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, తమిళనాడు సీఎం స్టాలిన్, మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ థాక్రే తనతో టచ్‌లో ఉన్నారని చెబుతున్నారు. అంతేకాదు, అవసరమైతే కొత్త జాతీయ పార్టీ పెట్టడానికైనా సిద్ధమేనని ప్రకటించారు. ఏదేమైనా జాతీయ రాజకీయాల్లోకి వెళ్లాలని కేసీఆర్ బలంగా నిశ్చయించుకున్నట్లు ఈ పరిణామాలను గమనిస్తే అర్థమవుతోంది. బీజేపీని శత్రువుగా ప్రకటించి కేసీఆర్ యుద్ధం ప్రకటించిన వేళ మోదీ ఆయనకు విషెస్ చెప్పడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.
Also Read: Horoscope Today Feb 17 2022: రాశి ఫలాలు.. ఆ రాశి వారికి ముక్కు సూటితనం పనికిరాదు..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook