Cabinet Meeting : అటవీశాఖ ఉద్యోగాల్లో రిజర్వేషన్ల అమలుకు గ్రీన్ సిగ్నల్, ఫారెస్ట్ యూనివర్సిటీకి ఆమోదం

Telangana Cabinet Meeting, reservations in Forest Department jobs : తెలంగాణ కేబినెట్‌ సమావేశంలో అటవీశాఖ ఉద్యోగాల్లో రిజర్వేషన్లపై చర్చించారు. అటవీశాఖ ఉద్యోగాల్లో రిజర్వేషన్ల అమలుకు కేబినెట్ ఆమోదించింది. తెలంగాణలో ఫారెస్ట్ యూనివర్సిటీ ఏర్పాటుకు కేబినేట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 17, 2022, 08:40 PM IST
  • అటవీశాఖ ఉద్యోగాల్లో రిజర్వేషన్ల అమలుకు గ్రీన్ సిగ్నల్
    ఇచ్చిన కేబినెట్
  • ఎఫ్‌సీఆర్‌ఐలో చదివిన అర్హులైన విద్యార్థులకు ఫారెస్ట్ డిపార్టుమెంట్ ఉద్యోగాల భర్తీలో రిజర్వేషన్లు
  • తెలంగాణలో ఫారెస్ట్ యూనివర్సిటీ ఏర్పాటుకు కేబినేట్ ఆమోదం
Cabinet Meeting : అటవీశాఖ ఉద్యోగాల్లో రిజర్వేషన్ల అమలుకు గ్రీన్ సిగ్నల్, ఫారెస్ట్ యూనివర్సిటీకి ఆమోదం

Telangana Cabinet Meeting Green signal for implementation of reservations in Forest Department jobs : తెలంగాణ సీఎం కేసీఆర్ అధ్యక్షతన ప్రగతి భవన్‌లో కొనసాగిన రాష్ట్ర కేబినెట్‌ సమావేశంలో (Telangana Cabinet Meeting) పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అటవీశాఖ ఉద్యోగాల్లో (forest department jobs) రిజర్వేషన్ల అమలుకు కేబినెట్‌ గ్రీన్ సిగ్నల్ (Green signal) ఇచ్చింది. సిద్ధిపేట జిల్లా ములుగులోని ఫారెస్ట్ కాలేజ్ అండ్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్‌లో బీఎస్సీ ఫారెస్ట్రీ నాలుగేళ్ల డిగ్రీ కోర్స్‌ను ప్రభుత్వం అందిస్తోంది. ఎఫ్‌సీఆర్‌ఐలో (FCRI) చదివిన అర్హులైన విద్యార్థులకు ఫారెస్ట్ డిపార్టుమెంట్ ఉద్యోగాల భర్తీలో డైరెక్ట్ రిక్రూట్‌మెంట్‌ కోటాలో (Direct Recruitment‌) భాగంగా పలు విభాగాల్లో రిజర్వేషన్లు కల్పించాలని కేబినేట్ నిర్ణయించింది.

అసిస్టెంట్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ విభాగంలోని ఉద్యోగాల్లో 25 శాతం రిజర్వేషన్స్, ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ విభాగానికి చెందిన జాబ్‌లలో (jobs) 50శాతం రిజర్వేషన్లు (Reservations) కల్పించాలని కేబినేట్ నిర్ణయించింది.

అలాగే ఫారెస్టర్స్ విభాగానికి చెందిన జాబ్‌లలో 50శాతం రిజర్వేషన్స్ కల్పించాలని కేబినేట్ నిర్ణయం తీసుకుంది. ఇందుకోసం తెలంగాణ రాష్ట్ర ఫారెస్ట్ సర్వీస్ రూల్స్, తెలంగాణ స్టేట్ ఫారెస్ట్ సబార్డినేట్ సర్వీస్ రూల్స్‌లలో సవరణలు చేపట్టాలని కేబినెట్ సమావేశంలో (Cabinet meeting) నిర్ణయం తీసుకున్నారు. 

Also Read : Hyderabad: గాంధీ, ఎర్రగడ్డ ఆస్పత్రుల్లో కరోనా కలకలం

అలాగే తెలంగాణలో ఫారెస్ట్ యూనివర్సిటీ (Forest University) ఏర్పాటుకు కేబినేట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అటవీశాఖ అధికారులు ఇందుకు సంబంధించిన ప్రాథమిక సమాచారంతో కూడిన నివేదికను కేబినేట్‌కు అందించారు. వచ్చే కేబినేట్ సమావేశం నాటికి పూర్తిస్థాయి నివేదికను సిద్ధం చేయాలంటూ అటవీశాఖ అధికారులను కేబినేట్ (Cabinet) ఆదేశించింది. ఇక తెలంగాణలో (Telangana) మహిళా యూనివర్సిటీ ఏర్పాటుకు విద్యాశాఖ మంత్రి చేసిన ప్రతిపాదనకు కేబినెట్ ఆమోదం తెలిపింది.

Also Read: Husband Wife Funny Videos: నిద్రపోతున్న భర్తతో భార్య ఏం చేసిందో చూడండి!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News