కేంద్రానికి సీఎం కేసీఆర్ హెచ్చరిక.. ఆ నిర్ణయంపై వెనక్కి తగ్గకపోతే దేశవ్యాప్త ఆందోళనలు..
CM KCR on Fertilizer prices hike: పెంచిన ఎరువుల ధరలను తగ్గించకుంటే దేశవ్యాప్త ఆందోళనలు చేపడుతామని సీఎం కేసీఆర్ కేంద్రాన్ని హెచ్చరించారు. తక్షణమే ధరలను తగ్గించాలని డిమాండ్ చేశారు.
CM KCR on Fertilizer prices hike: నిన్నటిదాకా వరి ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్రంపై ఫైట్ చేసిన సీఎం కేసీఆర్... తాజాగా ఎరువుల ధరల పెంపుపై మరో ఫైట్ తప్పదంటున్నారు. ఎరువుల ధరలు పెంచుతూ కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని సీఎం కేసీఆర్ (CM KCR) తీవ్రంగా ఖండించారు. ధాన్యం కొనుగోలు చేయమని చెప్పే కేంద్రం ఎరువుల ధరలు పెంచడమేంటని ప్రశ్నించారు. దేశంలో రైతులను బీజేపీ బతకనిచ్చేలా లేదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని చెప్పిన కేంద్ర ప్రభుత్వం... ఇప్పుడిలా ఎరువుల ధరలు పెంచి రైతులపై మరింత భారాన్ని మోపడం దుర్మార్గమని కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యుత్ మోటార్లకు మీటర్లు పెట్టి బిల్లులు వసూలు చేయడం... ఎరువుల ధరలు పెంచడం... ఇవన్నీ వ్యవసాయాన్ని కార్పోరేట్లకు కట్టబెట్టే కుట్ర అని ఆరోపించారు. ఎరువుల ధరలను తగ్గించకపోతే దేశవ్యాప్తంగా ఆందోళనలకు సిద్ధమని ప్రకటించారు. దేశంలో బీజేపీని కూకటి వేళ్లతో సహా పెకిలించి వేయాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. కేంద్రం మెడలు వంచి తీరుతామన్నారు.
వ్యవసాయ, అనుబంధ రంగాలను నిర్వీర్యం చేయడంతో పాటు గ్రామీణ ఆర్థిక రంగాన్ని కుదేలు చేసేలా కేంద్రం నిర్ణయాలు ఉంటున్నాయని కేసీఆర్ (CM KCR) ఆరోపించారు. బీజేపీ పచ్చి రైతు వ్యతిరేక ప్రభుత్వమని విమర్శించారు. కేంద్రంపై రైతులు తిరగబడాల్సిన అవసరం ఉందని... ఆ పార్టీ నేతలను రైతులు ఎక్కడికక్కడ నిలదీయాలని అన్నారు. తక్షణమే ఎరువుల ధరలు తగ్గించకపోతే దేశవ్యాప్తంగా ఆందోళనలు చేస్తామని పేర్కొన్నారు. ఇదే విషయమై ఈ సాయంత్రం ప్రధాని మోదీకి కేసీఆర్ బహిరంగ లేఖ రాయనున్నారు.
Also Read: IIT Hyderabad Corona: హైదరాబాద్ ఐఐటీలో కొవిడ్ కలవరం.. 119 మంది విద్యార్థులకు కరోనా
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook