TRS Plenary: తెలంగాణ రాష్ట్ర సమితి(తెరాస) అధ్యక్షుడిగా కేసీఆర్(CM KCR) మరోసారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. పార్టీ ఎన్నికల అధికారి శ్రీనివాస్‌రెడ్డి కేసీఆర్ ఎన్నికను ప్రకటించారు. కేసీఆర్ వరుసగా తొమ్మిదోసారి పార్టీ అధ్యక్షునిగా ఎన్నికయ్యారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తెరాస 20 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా.. హైదరాబాద్(Hyderabad)​ మాదాపూర్​లోని హైటెక్స్​(TRS Plenary)లో ప్లీనరీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ముందుగా పార్టీ అధ్యక్షునిగా కేసీఆర్ ఎన్నికను ప్రకటించారు. మరోసారి బాధ్యతలు చేపట్టిన కేసీఆర్ పార్టీ నేతలు(TRS Party Leaders) అభినందనలు తెలిపారు. హైటెక్స్​లో ఏర్పాటు చేసిన ప్లీనరీ ప్రాంగణానికి కేసీఆర్ రాకతో సమావేశాలు మొదలయ్యాయి. ముందుగా గులాబీ దళపతి పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేసి నమస్కరించారు. అమరవీరులకు నివాళులు అర్పించారు. ముఖ్యమంత్రి కేసీఆర్​కు హోంమంత్రి మహమూద్ అలీ దట్టి కట్టారు.


Also Read: Encounter: తెలంగాణ-ఛత్తీస్‌గఢ్ అటవీ ప్రాంతంలో భారీ ఎన్‌కౌంటర్, ముగ్గురి మృతి


దేశ రాజకీయాల్లో సరికొత్త చరిత్రను లిఖించిన గులాబీ జెండా రెండు దశాబ్దాలు(20 years of trs party) పూర్తి చేసుకుంది. మలిదశ ఉద్యమాన్ని ముందుండి నడిపించిన గులాబీ దళపతి కేసీఆర్.. ప్రత్యేక తెలంగాణ సాధకుడిగా చరిత్ర సృష్టించారు. స్వీయ రాజకీయ అస్థిత్వం పేరిట తిరుగులేని శక్తిగా..... తెరాసను తీర్చిదిద్దారు. ఏప్రిల్ 27న ఇరవై వసంతాలు పూర్తి చేసుకున్న గులాబీ పార్టీ(20 years of trs party).. 21వ సంవత్సరంలోకి అడుగుపెట్టింది.


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook