CM KCR's health condition | హైదరాబాద్: సికింద్రాబాద్ యశోధ హాస్పిటల్లో సీఎం కేసీఆర్ వైద్య పరీక్షలు ముగిశాయి. సీఎం కేసీఆర్ వైద్య పరీక్షలపై ఆయన వ్యక్తిగత వైద్యుడు డా. ఎం.వి. రావు స్పందిస్తూ.. ముఖ్యమంత్రి కేసీఆర్ ఊపిరితిత్తుల్లో మైల్డ్‌ ఇన్‌ఫెక్షన్‌ ఉందని.. ఆ ఇన్‌ఫెక్షన్ ( Lungs infection ) కారణంగానే ఆయనకు ఊపిరితిత్తుల్లో మంటగా అనిపించిందని తెలిపారు. ఊపిరితిత్తుల్లో ఇన్‌ఫెక్షన్ తొలగించేందుకు 5 రోజులకు సరిపడే మెడిసిన్‌ ఇచ్చామని చెప్పిన డా. ఎం.వి. రావు.. ఇంకా బ్లడ్‌ రిపోర్ట్స్‌, 2డి ఈకో రిపోర్టులు రావాల్సి ఉందని అన్నారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also read : Telangana: కేసీఆర్‌కు అస్వస్థత..యశోద ఆసుపత్రిలో పరీక్షలు


సీఎం కేసీఆర్‌కి ( CM KCR ) గతంలోనే బ్రాంకయిటీస్ సమస్య ఉన్న కారణంగా ఆయనకు ప్రతీ శీతాకాలంలో కొద్దిపాటి ఆరోగ్య సమస్యలు ఎదురవడం సహజమేనని.. అందుకే ఆయనకు అన్ని వైద్య పరీక్షలు నిర్వహించామని చెప్పిన డా ఎం.వి. రావు.. అంతకుమించి ముఖ్యమంత్రి కేసీఆర్‌కి ఆరోగ్యపరంగా ( CM KCR health condition ) ఎలాంటి ఇబ్బందిలేదని వెల్లడించారు.


Also read : Telangana: కిడ్నాప్ కేసులో టీడీపీ మాజీ మంత్రి అఖిల ప్రియ అరెస్టు


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook