తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నేడు మరో కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. జనగామ జిల్లా కొడకండ్లలో కొత్తగతా నిర్మించిన రైతువేదిక భవనాన్ని ముఖ్యమంత్రి ఇవాళ ప్రారంభించారు. దేశంలో మరే రాష్ట్రంలో లేని వినూత్నమైన కార్యక్రమం అయిన రైతువేదికను ప్రారంభించి ప్రభుత్వం రైతాంగానికి అండగా ఉంటుంది అని తెలిపారు కేసీఆర్ ( KCR ).


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read | TS EAMCET: ఇంటర్ వెయిటేజ్ మార్కులు ఈ ఏడాది లేనట్టే


వైభవంగా జరిగిన ఈ కార్యక్రమానికి ప్రభుత్వ సీఎస్ సోమేష్ కుమార్, రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్ తో పాటు మంత్రులు నిరంజన్ రెడ్డి, సత్యవతి రాథోడ్ , వరంగల్ జిల్లా ( Warangal ) ఎంపీలు, స్థానిక నేతలు, ఇతర అధికారులు పాల్గొన్నారు.



Also Read:  AP Ration Cards: 35 రోజుల్లోనే 6 లక్షల రేషన్ కార్డులు జారీ చేసి ఏపి ప్రభుత్వం


కొడకండ్ల జిల్లాలో ముఖ్యమంత్రి కేసీఆర్ ను అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం రైతు వేదిక శిలాఫలకాన్ని ఆవిష్కరించారు కేసీఆర్. రైతుల కోసం ప్రత్యేక కార్యక్రమాన్ని, రైతువేదికను ప్రారంభించడం పట్ల రైతులు ఆనందాన్ని వ్యక్తం చేశారు.


A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే  ZEEHINDUSTAN App డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


IOS Link - https://apple.co/3loQYeR